
బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలాకు చేదు అనుభవం ఎదురైంది. ఇటీవల వింబుల్డన్ టోర్నీ చూసేందుకు లండన్ వెళ్లగా తన ఖరీదైన ఆభరణాలు చోరీకి గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. లండన్‌లోని గాట్విక్ విమానాశ్రయంలో ఈ సంఘటన జరిగిందని తెలిపింది. దాదాపు రూ.70 లక్షల విలువైన ఆభరణాలు కలిగిన తన లగ్జరీ బ్యాగ్ పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. విమానాశ్రయ అధికారులు ఎలాంటి సహాయం చేయలేదని ఊర్వశి నిరాశ వ్యక్తం చేసింది. విమానాశ్రయంలోని బ్యాగేజ్ బెల్ట్ నుంచి నా లగేజీ చోరీకి గురైందని పేర్కొంది.
ఈ విషయాన్ని తాజాగా సోషల్ మీడియా ద్వారా పంచుకుంది ముద్దుగుమ్మ. ఈ సంఘటనను వివరిస్తూ విమానాశ్రయంలో భద్రతా లోపాన్ని ప్రస్తావించింది. ప్లాటినం ఎమిరేట్స్ సభ్యురాలిగా వింబుల్డన్కు గ్లోబల్ ఆర్టిస్ట్గా హాజరైనట్లు వెల్లడించింది. ముంబయి నుంచి గాట్విక్ చేరుకోగా.. ఎయిర్పోర్ట్లో తన బ్యాగ్ దొంగిలించారని పోస్ట్ చేసింది. బ్యాగ్తో పాటు టికెట్ వివరాలను సైతం సోషల్ మీడియాలో పంచుకుంది. త్వరగా తన బ్యాగ్ తిరిగొచ్చేలా చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసులకు విజ్ఞప్తి చేసింది. కానీ అక్కడి అధికారుల నుంచి తనకు ఎలాంటి సహకారం అందలేదని వాపోయింది.

కాగా.. ఈ బాలీవుడ్ ముద్దుగమ్మ సినిమాలతో పాటు ప్రత్యేక సాంగ్స్తో అభిమానులను అలరించింది. టాలీవుడ్లోనూ స్టార్ హీరోల చిత్రాల్లో మెప్పించింది. బాలయ్య, మెగాస్టార్ సినిమాల్లోనూ కనిపించింది.