
బాలీవుడ్ భామ ఆలియా భట్ ప్రస్తుతం సినిమాలకు కాస్తా గ్యాప్ ఇచ్చింది. ఈ ఏడాది అల్ఫా మూవీతో ప్రేక్షకులను పలకరించనుంది. గతేడాది వచ్చిన జిగ్రా అభిమానులను తీవ్రంగా నిరాశపర్చింది. దీంతో ఈ సినిమాపై అభిమానుల్లో ఆలియా భట్ ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. ఈ మూవీని యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి శివ్ రావేల్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే షూటింగ్లకు కాస్తా విరామం దొరకడంతో ఆలియా భట్ ఫిట్‌నెస్ కోసం కసరత్తులు చేస్తోంది. ముంబయిలోని తన నివాసం వద్ద పాడిల్ బాల్ ఆడుతూ కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.
అయితే అంతకుముందే పాడిల్ బాల్ ఆడేందుకు వచ్చిన ఆలియాను కారు దిగగానే ఫోటోగ్రాఫర్స్ చుట్టుముట్టారు. ఆమెను ఫోటోలు తీసేందుకు వెంటపడ్డారు. ఏకంగా ఆలియాతో పాటే బిల్డింగ్ లోపలికి వెళ్లేందుకు యత్నించారు. దీంతో ఆలియా భట్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. లోపలికి రావొద్దు.. దయచేసి బయటికి వెళ్లండి.. ఇది మీ భవనం కాదు అంటూ మండిపడింది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అయినా సెలబ్రిటీలను ఫోటోల కోసం ఇలా వెంటపడి వేధించడం సరికాదని కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వారికి పర్సనల్ లైఫ్ ఉంటుందని.. ఇలా ఇబ్బంది పెట్టపెట్టడం కరెక్ట్ కాదని అంటున్నారు. ఇలా చేసేవారికి కొంతైనా కామన్ సెన్స్ ఉండాలని.. సెలబ్రిటీలను బాధపెట్టడం సరికాదని ఓ అభిమాని కామెంట్ చేశాడు.
Alia Bhatt spotted playing Padel #AliaBhatt #padel pic.twitter.com/NPwpzi7iQ8
— Aristotle (@goLoko77) August 14, 2025
కాగా.. యశ్‌రాజ్ ఫిల్మ్స్ తన స్పై యూనివర్స్‌లో భాగంగానే ఆల్ఫా చిత్రం రానుంది. ఈ ఏడాది డిసెంబర్ 25న ఈ చిత్రం విడుదల కానుంది. స్పై యూనివర్స్‌లో రాబోతున్న మొదటి మహిళా గూఢచారి చిత్రంగా ఆల్ఫా రికార్డ్ క్రియేట్ చేయనుంది. దీంతో పాటు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రానున్న లవ్ అండ్ వార్ చిత్రంలో నటించనుంది.