
రంగారెడ్డి: షాద్ నగర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. వాటర్ ట్యాంకర్ ఢీ కొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను షాద్ నగర్‌కు చెందిన తండ్రీకూతురు మశ్చేందర్, మైత్రిగా గుర్తించారు.
శనివారం ఉదయం తండ్రీకూతురు బైక్‌పై వెళ్తున్నారు. షాద్ నగర్ చౌరస్తాకు చేరుకోగానే.. వేగంగా వచ్చిన వాటర్ ట్యాంకర్ వీళ్లను ఢీ కొట్టింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. ట్యాంకర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి.. మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు.