breaking news
shadnagar accident
-
షాద్ నగర్లో క్షుద్ర పూజలు..బయటపడ్డ దొంగ స్వామీజీ బాగోతం
సాక్షి, రంగారెడ్డి: పల్లెల్లో మూఢనమ్మకాలు ఇంకా రాజ్యమేలుతున్నాయి. మంత్రతంత్రాలు, గుప్తనిధుల పేరుతో కొందరు గ్రామీణులు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మంత్రతంత్రాలు, బాణామతి, చేతబడులు అంటూ మూఢ నమ్మకాలను అమాయక ప్రజలు నమ్ముతూనే ఉన్నారు. తాజాగా షాద్‌నగర్ మండలం కమ్మదనం గ్రామ శివారులు ఓ దొంగ బాబా క్షుద్రపూజలు కలకలం రేపుతున్నాయి. శివస్వామి అనే వ్యక్తి కొంతకాలంగా ఓ ప్రైవేట్ వెంచర్ లో ఇల్లు కట్టుకుని.. కాళికామాత విగ్రహం పెట్టి పూజలు చేస్తున్నాడు. అతని వద్దకు వెళ్లేవారి కళ్లల్లో నిమ్మ రసం పిండి, వెంట్రుకలు పట్టి కొడుతున్నాడు. అమ్మవారి పాదాల కింద పోటోలు పెట్టి వశీకరణ మంత్రం రాగి పూతలతో కూడుకున్న పేర్లు రాసి పెడుతున్నాడు. గతంలో మధురాపూర్ గ్రామంలో ఇలాగే ప్రవర్తించగా.. గ్రామస్తులు బెదిరించడంతో అక్కడి నుండి వెంచర్ దగ్గరకు క్షుద్ర పూజలను షిఫ్ట్ చేశాడు. తాజాగా అతని వద్దకు హైదరాబాద్‌కు చెందిన ఓ యువతి తన తల్లి ఆరోగ్యం బాగా లేకపోవడంతో పూజలు చేయించడానికి తీసుకొచ్చింది. చదవండి: కొలంబో క్యాసినోలో శాశ్వత టేబుల్! .. ఉద్యోగాలు పోయిన వారే టార్గెట్ అయితే డబ్బులు తీసుకొని తల్లి ఆరోగ్యాన్ని నయం చేయలేదని మోపోయానని గ్రహించిన సదరు యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా నిందితుడు ఎలా క్షుద్ర పూజలు చేస్తాడో ఆ వీడియోతో సహా ఆధారాలు బయటపెట్టింది. దీంతో శివ స్వామీ బాబా బాగోతం వెలుగులోకి వచ్చింది. దొంగ స్వామిపై షాద్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని అదుపులోకి తీసుకున్నారు. కాగా తాను క్షుద్ర పూజలు చేయలేదని. ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకపోతే మంత్రిస్తానని స్వామి పోలీసులు తెలిపారు. చదవండి: మహిళా టెక్కీ ఆత్మహత్య.. రెండేళ్ల క్రితమే వివాహం.. -
షాద్ నగర్ చటన్‌పల్లి బైపాస్ వద్ద రోడ్డు ప్రమాదం
సాక్షి, రంగారెడ్డి : షాద్ నగర్ చటన్ పల్లి బైపాస్ వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వస్తున్న టాటా ఏపీ వాహనం ఆగి ఉన్న లారిని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలవ్వగా..ఇద్దరు చిన్నారులకు సైతం గాయాలయ్యాయి. టాటా ఏసీ వాహనం అద్దాలు పగిలి అందులో మహిళ ఇరుక్కుపోగా స్థానికులు అద్దాలు పగులగొట్టి ఆమెను బయటికి తీశారు. అనంతరం క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇటీవల ఎన్కౌంటర్ ఘటన జరిగిన ప్రాంతంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. -
డీసీఎం వాహనంలో అకస్మాత్తుగా మంటలు
-
ట్రాక్టర్ కింద పడి ఇంటర్ విద్యార్ధిని మృతి
-
విధిరాత.. మృత్యుగీత
- షాద్‌నగర్ ప్రమాదంలో చింతమాన్‌పల్లెకు చెందిన నలుగురి మృతి - మృతులంతా ఒకే కుటుంబ సభ్యులు - తండ్రికి వైద్యం చేయించేందుకు వస్తుండగా ఘటన సి.బెళగల్: వృద్ధాప్యంలోని తల్లిదండ్రులు హైదరాబాద్‌లో ఉంటున్న కుమారుడు వద్ద రెన్నాళ్లు గడుపుదామని వెళ్లారు. కష్టాలు, అనుభవాలు చెప్పుకుంటూ కాలం వెల్లదీస్తుండగా స్వల్ప ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడిన తండ్రికి వైద్యం చేయించేందుకు కుమారుడు కుటుంబ సభ్యులతో కారులో బయలుదేరారు. లారీ రూపంలో మృత్యువు చీకటిలో మాటు వేసి అందరినీ కబళించింది. తెలంగాణ రాష్ట్రం షాద్‌నగర్ సమీపంలో గురువారం అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో సి.బెళగల్ మండలం చింతమానుపల్లెకు చెందిన నలుగురితో పాటు గుర్తు తెలియని కారు డ్రైవర్ కూడా దుర్మరణం చెందాడు. చింతమానుపల్లెకు గ్రామానికి చెందిన బత్తిన సోమన్న(69), బత్తిన నర్సమ్మ(67) దంపతుల చిన్న కుమారుడు బత్తిన సోముడు(38) హైదరబాద్‌లో 15 ఏళ్లుగా బేల్దారి పని చేస్తూ జీవిస్తున్నాడు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు హైదరాబాద్‌లో ఉంటున్న కుమారుడు వద్ద రెండు రోజులు ఉండేందుకు నెల క్రితం వెళ్లారు. ఈ క్రమంలోనే గురువారం ఉదయం బాత్రూంలో బత్తిన సోమన్న కాలుజారి గాయపడ్డాడు. అతనికి కాలుకు కట్టుకట్టించేందుకు కుమారుడు సోముడు, తల్లి నర్సమ్మతో స్వగ్రామానికి అద్దె కారులో గురువారం రాత్రి 9 గంటల సమయంలో బయలుదేరారు. వీరితోపాటు హైదరాబాద్‌లోనే జీవిస్తున్న బత్తిన సోమన్న తమ్ముడి భార్య గిడ్డమ్మ(67) కూడా వారి వెంట వచ్చింది. మార్గమధ్యంలో గురువారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో రంగరెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని నందిగామ బైపాస్ రోడ్డు వద్ద 44 జాతీయ రహదారిపై ఆగి వున్న లారీని చీకట్లో గుర్తించని కారుడ్రైవర్ ఢీకొట్టాడు. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో కారు డ్రైవర్(పేరు తెలియలేదు)తో పాటు బత్తిన సోమన్న, బత్తిన నర్సమ్మ, బత్తిన సోముడు అక్కడికక్కడే మృతిచెందగా, గిడ్డమ్మకు తీవ్రగాయాలు కావటంతో స్థానికులు స్థానిక షాద్‌నగర్ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు.అయితే ఆసుపత్రిలో చేర్చిన వెంటనే గిడ్డమ్మ కూడ మరణించింది మృతుడు బత్తిన సోముడుకు భార్య రాములమ్మ, కుమారులు రాజు(17), కృష్ణ(14) ఉన్నారు. చింతమానుపల్లెలో విషాద ఛాయలు ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడంతో చింతమానుపల్లెలో విషాదఛాయలు అలుముకున్నాయి. శుక్రవారం ఉదయం ప్రమాద సమాచారం తెలుసుకున్న బంధువులు పెద్ద ఎత్తున గ్రామానికి చేరుకున్నారు. యాదవ కులానికి చెందిన ప్రజలు గ్రామంలో అత్యధికంగా ఉన్నారు. దీంతో గ్రామమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. ఇంతటి ప్రమాదాన్ని గ్రామస్తులు ఎన్నడూ ఎదుర్కోలేదు. మృతదేహాలు సాయంత్రం గ్రామానికి చేరుకోవడంతో జనమంతా వీధుల్లోకి చేరిపోయారు. నలుగురి మృతదేహాలను ఒకేసారి అంత్యక్రియలకు తీసుకుపోతున్న సమయంలో సంప్రదాయబద్ధంగా పెద్ద మనువడు రాజు తలకొరివి పడుతున్న దృశ్యం చూసి బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. మృతురాలు గిడ్డమ్మ భర్త బజారి చాలాకాలం క్రితం మృతి చెందగా, కూతురు మద్దమ్మకు, కుమారుడు ఆంజనేయులుకు పెళ్లిళ్లు అయ్యాయి. అయితే కూమారుడు, కోడలు గ్రామంలో నివాసం ఉండటంతో గిడ్డమ్మ ఒంటరిగానే జీవిస్తోంది. రెండు నెలల క్రితం కూలీ పని చేసేందుకు హైదరాబాద్‌కు వలస వెళ్లి తిరుగు ప్రయాణంలో మృతి చెందింది. విషయం తెలుసుకున్న కోడుమూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మురళీకృష్ణ, కోడుమూరు సీఐ శ్రీనివాస్, సి.బెళగల్ ఎస్ఐ శ్రీనివాసులు గ్రామానికి చేరుకుని మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు.