
సాక్షి, హైదరాబాద్: మాదాపూర్‌లో దారుణం జరిగింది. బెట్టింగ్ ఆడొద్దని మందలించిన తండ్రిని కుమారుడు చంపేశాడు. కొడుకు చదువు కోసం ఆరు లక్షలు ఇవ్వగా.. కొడుకు బెట్టింగ్ యాప్స్‌లో పెట్టి పోగొట్టాడు. దీంతో మందలించిన తండ్రి హనుమంత్‌ని హత్య చేసిన కుమారుడు రవీందర్.. ఆత్మహత్యగా క్రియేట్ చేశాడు. వనపర్తికి తీసుకెళ్లి తండ్రి మృతదేహానికి కర్మకాండ చేసే ప్రయత్నం చేశాడు.
బంధువులకు అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు.. రవీందర్‌ని అదుపులోకి తీసుకున్న విచారించారు. తండ్రిని తానే చంపానని రవీందర్ ఒప్పుకున్నాడు. రవీందర్‌ను రిమాండ్‌కు తరలించారు.
