
కుత్బుల్లాపూర్: ఓ వ్యక్తి కుమార్తెతో సహా చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన పేట్‌బïÙరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మైసమ్మగూడలోని సెయింట్ పీటర్స్ కాలేజీ వెనక ఉన్న చెరువులో గురువారం ఉదయం ఓ వ్యక్తి, బాలిక మృతదేహాలను గుర్తించిన స్థానికులు 100కు ఫోన్ చేసి సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వెలికి తీసి. విచారించగా బహదూర్‌పల్లి ఇందిరమ్మ కాలనీకి చెందిన అశోక్(50), అతని కుమార్తె దివ్య(05)గా గుర్తించారు. నాలుగేళ్లుగా అశోక్, అతడి భార్య సోనీ ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉంటున్నారు. అశోక్ వంట పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
మూడేళ్ల క్రితం రోడ్డు అతడి భార్య సోనీ రోడ్డు దాటుతుండగా లారీ ఢీనడంతో ఎడమ కాలు కోల్పోయింది. అప్పటి నుంచి ఇంట్లోనే ఉంటోంది. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో మూడు క్రితం అశోక్ ఆత్మహత్య చేసుకునేందుకు ఇంట్లోని గ్యాస్ సిలిండర్ లీక్ చేశాడు. దీనిని గుర్తించిన అతడి భార్య సోనీ కేకలు వేయడంతో చుట్టు పక్కల వారు వచ్చి మంటలను ఆరి్పవేసినట్లు సమాచారం. ఆ మర్నాడు సాయంత్రం అశోక్ కుమార్తెను తీసుకుని ఇంటి నుండి వెళ్లిన అశోక్ కుమార్తెతో సహా చెరువులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.