టాలీవుడ్ హీరోయిన్ ఇంట్లో తీవ్ర విషాదం | Bollywood actress Mannara Chopra Father Raman Rai Handa Dies In Mumbai | Sakshi
Sakshi News home page

Mannara Chopra: టాలీవుడ్ నటి మన్నారా చోప్రా ఇంట్లో తీవ్ర విషాదం

Jun 16 2025 9:10 PM | Updated on Jun 16 2025 9:10 PM

Bollywood actress Mannara Chopra Father Raman Rai Handa Dies In Mumbai

టాలీవుడ్ నటి, బిగ్ బాస్ కంటెస్టెంట్‌ మన్నారా చోప్రా ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి రమణ్ రాయ్ హండా తుదిశ్వాస విడిచారు. ఆయన 72 సంవత్సరాల వయసులో అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ విషాద వార్తను నటి సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ మృతిచెందారు. అంత్యక్రియలు జూన్ 18న నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

కాగా.. రమణ్ రాయ్ హండా బాలీవుడ్ హీరోయిన్స్ ప్రియాంక చోప్రా, పరిణీతి చోప్రాలకు మామ అవుతారు. ఆయనకు భార్య కామినీ చోప్రా, కుమార్తెలు మన్నారా, మితాలి చోప్రా ఉన్నారు. ఆయన ఢిల్లీ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. ప్రియాంక, పరిణీతి చోప్రాల అత్త కామిని చోప్రాను వివాహం చేసుకున్నారు.

m

కాగా.. మన్నారా థ్రిల్లర్ జిద్‌ అనే మూవీతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, పంజాబీ భాషల సినిమాల్లో నటించింది. తెలుగులో "ప్రేమ గీమ జాంత నై" చిత్రంతో పరిచయమైంది. ఆ తర్వాత సునీల్‌తో "జక్కన్న", సాయి ధరమ్ తేజ్‌తో "తిక్క" వంటి సినిమాల్లో నటించింది. అలాగే "రోగ్", "సీత" చిత్రాల్లో కూడా కనిపించింది.  గతేడాది తెలుగులో రాజ్ తరుణ్ సరసన తిరగబడరా సామీ చిత్రంలో కనిపించనుంది. అంతే కాకుండా హిందీ బిగ్ బాస్ సీజన్‌-17లో టాప్‌-3 కంటెస్టెంట్స్‌లో ఒకరిగా నిలిచింది.

Advertisement
 
Advertisement
Advertisement