
సాక్షి,బాపట్ల: బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలంలో జంట హత్యలు కలకలం రేపాయి. గుర్తు తెలియని దుండగులు తండ్రి, కొడుకులను గొంతుకోసి దారుణంగా హత్య చేశారు. మృతులు పాతమాగులూరికి చెందిన వీరాస్వామిరెడ్డి, ప్రశాంత్ రెడ్డిగా పోలీసులు గుర్తించారు. అయితే,వీరి హత్యకు బెంగుళూరులో ఆస్తి వివాదాలే కారణమని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.