జీజీహెచ్‌లో ఉచితంగా వైద్య సేవలు
గుంటూరు జీజీహెచ్‌లోని నన్నపనేని లోకాధిత్యుడు, సీతారావమ్మ స్మారక నాట్కో క్యాన్సర్ సెంటర్‌ను అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో నిర్మించాం. రోగులకు ఉచితంగా కార్పొరేట్ వైద్య సేవలు అందిస్తున్నాం. సర్జికల్ ఆంకాలజీ, మెడికల్ ఆంకాలజీ, రేడియో థెరపీ వైద్య సేవలు, న్యూక్లియర్ మెడిసిన్ వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. నాట్కో ట్రస్టు, ప్రభుత్వ భాగస్వామ్యంలో సుమారు రూ. 45 కోట్లతో రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా అత్యాధునిక వైద్య సౌకర్యాలతో 125 పడకలతో ఈ సెంటర్ నిర్మించాం. మరో రూ.18 కోట్లతో 125 పడకల క్యాన్సర్ సెంటర్‌ను నిర్మిస్తున్నాం. ఈ ఏడాది జూన్ నాటికి అందుబాటులోకి వస్తుంది. ఆపరేషన్లు, మందులూ ఉచితం.
–నన్నపనేని సదాశివరావు, నాట్కో ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్


