
టాలాంట్ చూపించడంలో మనోళ్ల తర్వాతే ఎవరైనా. ఎలాంటి దాన్నైనా వెరైటీగా వాడాలంటే కొంచెం బుర్ర వాడాలి. ఈ వాడకంలో మనోళ్లు మామూలోళ్లు కాదు. అసలేంటి ఇదంతా అనుకుంటున్నారా? సరే. సూటిగా సుత్తిగా లేకుండా విషయంలోకి వెళ్లిపోదాం. తెలుగు రాపర్ రోల్ రిడా ఒక వీడియోను షేర్ చేశాడు. ఇదే ఇపుడు నెట్టింట తెగ సందడి చేస్తోంది.
ఇంతకీ ఈ వీడియోలో ఏముందీ అంటే పిల్లలను వెనకి కూర్చోబెట్టుకుని ఝాం అంటూ వెళ్లి పోతున్నాడో డాడీ. అయితే ఏంటట అంటూ అప్పుడే ఫిక్స్ అయిపోవద్దు. ఇక్కడే ఉంది అసలు కత అంతా... సాధారణంగా సీటుపై కూర్చొంటే వింతేముంది. కోడి, ఇతర పక్షులను తీసుకెళ్లే ఒక బుట్ట ( పౌల్ట్రీ క్యారియర్) లాంటిది దాంట్లో వీల్ళద్దర్నీ కూర్చోబెట్టాడన్నమాట. ఈ పౌల్ట్రీ క్యారియరే నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. జస్ట్ కిడ్..డ్డింగ్ అనే క్యాప్షన్ కూడా దీనికి. రోల్ రిడా "ఇది భారతదేశంలో మాత్రమే జరుగుతుంది" అని వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు.
ఇదీ చదవండి: వ్యాపారవేత్తతో బిగ్‌బాస్ బ్యూటీ ఎంగేజ్‌మెంట్ : ఫోటోలు వైరల్
ఈ వీడియో ఇప్పటికే 30 లక్షలకు పైగా వ్యూస్ సంపాదించుకుంది. దీనిపై నెటిజన్లు అనేక కమెంట్లు చేస్తున్నారు. "కోళ్ల సమాజం హర్ట్ భయ్యా" అంటూ ఒకరు ఫన్నీగా కమెంట్ చేశారు. మరొకరు తండ్రి క్రియేటివ్ ఆవిష్కరణను మెచ్చుకోగా, "అమ్మ కంటే నాన్న ఎప్పుడూ భిన్నంగా ఆలోచిస్తాడు" అని మరొకరు అన్నారు. బైక్ నంబర్ ప్లేట్ అది ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బైక్‌గా భావిస్తున్నప్పటి, ఇది ఎక్కడిది అనేది ఖచ్చితమైన తెలియదు.