
ప్రముఖ కన్నడ నటి వైష్ణవి గౌడ (Vaishnavi Gowda) తన అభిమానులను గుడ్ న్యూస్ చెప్పింది. 2013 టీవీ సీరియల్ అగ్నిసాక్షి సీరియల్ పాపులర్ అయినా వేలాది మంది అభిమానుల హృదయాల్లో ఒక ముద్ర వేసిన ఈ అమ్మడు జీవితంలో కొత్త అధ్యయానికి నాంది పలకబోతోంది. ప్రియుడు అనుకూల్ మిశ్రాతో ఏడు అడుగులు వేసేందుకు సిద్ధమవుతోంది. ఏప్రిల్ ప తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ విషయాన్ని ప్రకటించింది. తన నిశ్చితార్థం చిత్రాలను పోస్ట్ చేసింది. దీంతో అభిమానులు అభినందనలు వెల్లువెత్తాయి.
‘సీతారామ’ సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గరైంది వైష్ణవి గౌడ. సంపన్న కుటుంబానికి చెందిన వ్యాపారవేత్త అనుకూల్ మిశ్రాతో నిశ్చితార్థం చేసుకుంది. సాంప్రదాయబద్దంగా జరిగిన ఈ వేడుకకు సన్నిహితులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ముఖ్యంగా ప్రముఖ కన్నడ నటి అమూల్య గౌడ, ప్రెజెంబర్ చైత్ర వాసుదేవన్, పూజా లోకేష్, రీతూ సింగ్, జ్యోతి కిరణ్ తదితరులు హాజరయ్యారు. వీరి ఎంగేజ్‌మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ నిశ్చితార్థ వేడుక కోసం, వైష్ణవి గౌడ భారీగా ఎంబ్రాయిడరీ చేసిన క్రీమ్ అండ్ గోల్డెన్ కలర్ లెహంగాలో అందంగా ముస్తాబైంది. సీక్విన్, బీడ్‌వర్క్, సున్నితమైన జరీతో కూడిన సంక్లిష్టంగా అలంకరించబడిన బ్లౌజ్ ధరించింది. ఇంకా పచ్చరంగు రాళ్ల స్టేట్‌మెంట్ చోకర్ నెక్లెస్‌ను కూడా జత చేసింది. ఇంకా మ్యాచింగ్ చెవిపోగులు, మాంగ్ టీకా, స్టేట్‌మెంట్ కడాతన లుక్‌ను మరింత ఎలివేట్ చేసింది. మరోవైపు అనుకూల్ మిశ్రా క్లిష్టమైన ఎంబ్రాయిడరీతో ఐవరీ షేర్వానీలో రాయల్ లుక్‌లో అందంగా కనిపించాడు.
వైష్ణవి గౌడ గురించి మరిన్ని వివరాలు
వైష్ణవి గౌడ 1995, ఫిబ్రవరి 20, 1995న జన్మించారు. ఆమె కన్నడ నటి అమూల్యకు ప్రాణ స్నేహితురాలు. భరతనాట్యం, కూచిపూడి లాంటి క్లాసికల్ డ్యాన్సర్. అంతేకాదు బెల్లీ డాన్సర్ కూడా. గత పదేళ్లకుపైగా టీవీ ఇండస్ట్రీలో పనిచేస్తోంది. 2011లో 16 సంవత్సరాల చిన్న వయసులో వైష్ణవి తన మొదటి షో 'దేవి' చేసింది. ఇందులో టైటిల్ రోల్ పోషించిని వై ష్ణవి వరుస ఆఫర్లను దక్కించుకుంది. అయితే, ఆమె 2013 షో 'అగ్నిశాక్షి' బాగా పేరు తెచ్చిపెట్టింది. తరువాత ఆమె బిగ్ బాస్ కన్నడ సీజన్ 8లో కూడా పాల్గొంది.