బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మేనల్లుడు అయాన్ అగ్నిహోత్రి ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పారు. తన ప్రియురాలు టీనా రిజ్వానీతో నిశ్చితార్థం చేసుకున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ప్రియురాలికి ప్రపోజ్ చేసిన ఫోటోలను షేర్ చేశారు. ఇవీ కాస్తా వైరల్ కావడంతో అయాన్‌కు అభినందనలు చెబుతున్నారు. కాగా.. సల్మాన్ ఖాన్ మేనల్లుడు సంగీతకారుడు అయాన్ అగ్నిహోత్రి సింగర్, మ్యూజిషియన్‌గా రాణిస్తున్నారు. ఇటీవల దుబాయ్‌లో జరిగిన ఒక ఈవెంట్‌లో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు.
మరోవైపు సల్మాన్ ఖాన్ ప్రస్తుతం'బ్యాటల్ ఆఫ్ గాల్వాన్' పేరుతో తీస్తున్న ఓ సినిమాలో హీరోగా చేస్తున్నాడు. కొన్నిరోజుల క్రితమే టీజర్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ సల్మాన్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ చిత్రాన్ని అపూర్వ లఖియా దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. సల్మాన్ ఖాన్ ఇందులో ఇండియన్ ఆర్మీ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. 2020లో గల్వాన్ లోయలో భారత-చైనా సైనిక ఘర్షణ ఘటన నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇందులో వీరమరణం పొందిన తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన కల్నల్ బిక్కుమళ్ళ సంతోష్ బాబు పాత్రలో సల్మాన్ కనిపించబోతున్నారు.


