
సాక్షి,బాపట్ల: జిల్లా సంతమాగులూరు మండలంలో జరిగిన జంట హత్య కేసులో టీడీపీ నేత బాదం మాధవరెడ్డి పాత్ర ఉన్నట్లు సమాచారం.
చెల్లని చెక్ బౌన్స్ కేసులో కోర్టుకు హాజరయ్యేందుకు వచ్చిన తండ్రి కుమారుడు కిడ్నాప్,దారుణ హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పోలీసుల వివరాల మేరకు చెల్లని చెక్ బౌన్స్ కేసులో కోర్టుకు వెళ్తున్న వీరాస్వామి రెడ్డి, ప్రశాంత్ రెడ్డిలను అగంతకులు కిడ్నాప్ చేశారు. అనంతరం దారుణంగా హత్య చేశారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో తండ్రీ,కొడుకుల హత్య కేసులో టీడీపీ నేత బాదం మాధవరెడ్డి పాత్ర ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బెంగుళూరులో బాదం మాధవరెడ్డితో హతులు వీరాస్వామి రెడ్డి, ప్రశాంత్ రెడ్డికి ఆర్ధిక పరమైన గొడవలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఆస్తి వివాదం కారణంగానే మృతుల్ని పక్కాప్లాన్ ప్రకారం హత్య చేశారని, హత్యలో స్వయంగా బాదం మాధవరెడ్డి పాల్గొన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.