పట్టపగలే నడిరోడ్డుపై.. కన్న కొడుకే తండ్రిని కత్తితో పొడిచి.. | Son Attacks Father In Kushaiguda | Sakshi
Sakshi News home page

పట్టపగలే నడిరోడ్డుపై.. కన్న కొడుకే తండ్రిని కత్తితో పొడిచి..

Feb 22 2025 7:08 PM | Updated on Feb 22 2025 7:18 PM

Son Attacks Father In Kushaiguda

సాక్షి, మేడ్చల్ జిల్లా: కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. పట్టపగలే నడిరోడ్డుపై కన్న కొడుకే తండ్రిని కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. సికింద్రాబాద్‌ లాలాపేటకు చెందిన ఆరెల్లి మొగిలి (45) ప్యాకర్స్‌ అండ్‌ మూవర్స్‌లో పనిచేస్తుండగా, అతని కుమారుడు సాయి కూడా అదే కంపెనీలో పనిచేస్తున్నాడు. మద్యానికి బానిసైన మొగిలి.. నిత్యం తాగొచ్చి ఇంట్లో గొడవ చేసేవాడు. కుటుంబ కలహాలతో పాటు వీరిమధ్య కొంతకాలంగా ఆస్తికి సంబంధించి తగాదాలు కూడా ఉన్నాయి.

దీంతో విసిగిపోయిన సాయికుమార్‌.. తండ్రినే హతమార్చాలని భావించాడు. శనివారం మధ్యాహ్నం లాలాపేట నుంచి బస్సులో వెళ్తున్న మొగలిని కుమారుడు సాయి వెంబడించాడు.. ఈసీఐఎల్‌ బస్‌ టెర్మినల్‌ వద్ద మొగిలి బస్సు దిగగానే.. వెనుక నుంచి వెళ్లి కత్తితో దాడి చేశాడు. 

దాదాపు 15 సార్లు విచక్షణారహితంగా కత్తితో పొడిచాడు. స్థానికులు మొగిలిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించగా, అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందాడు.  సీసీ కెమెరాల్లో రికార్డయిన దాడి దృశ్యాలు ఆధారంగా నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement