రణభేరికి సన్నద్ధంకండి | - | Sakshi
Sakshi News home page

రణభేరికి సన్నద్ధంకండి

Mar 4 2026 7:19 AM | Updated on Mar 4 2026 7:19 AM

రణభేరికి సన్నద్ధంకండి

ఒంగోలు సిటీ: యూటీఎఫ్‌ త్వరలో చేపట్టబోయే 3.ఓ రణభేరి కార్యక్రమానికి సన్నద్ధం కావాలని యూటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్‌ అబ్దుల్‌ హై పిలుపునిచ్చారు. యూటీఎఫ్‌ జిల్లా కార్యాలయంలో జిల్లా శాఖ కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షుడు కిలారి వెంకటేశ్వర్లు అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్‌ అబ్దుల్‌ హై మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 12వ పీఆర్‌సీ కమిషన్‌ వేయాలని, ఐఆర్‌ 29 శాతం ప్రకటించాలన్నారు. జిల్లా అధ్యక్షుడు కిలారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులకు రూ.25 వేల కోట్ల బకాయిల చెల్లింపులకు సంబంధించి ఒక రూట్‌ మ్యాప్‌ ప్రకటించాలన్నారు. తక్షణమే సరెండర్‌ లీవ్‌ బకాయిలు, డీఏ బకాయిలు మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ బడుల్లో విద్యార్థులను చేర్పించి ఊరి బడిని కాపాడుకుందామని యూటీఎఫ్‌ స్పెషల్‌ ఎన్‌రోల్‌మెంట్‌ డ్రైవ్‌ చేపట్టిందని సంఘ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.రవి అన్నారు. ప్రకాశం జిల్లా శాఖ వివిధ మండల శాఖలకు మీ మండలంలోని అత్యధికంగా ఎన్‌రోల్మెంట్‌ విద్యార్థులను చేసిన వారికి ప్రత్యేకమైన బహుమతులు ఇస్తామని తెలిపారు. కార్యక్రమంలో సీనియర్‌ నాయకుడు డీ వీరాంజనేయులు, జిల్లా సహాధ్యక్షుడు వై వెంకట్రావ్‌, సహాధ్యక్షురాలు జీ ఉమామహేశ్వరి, జిల్లా కోశాధికారి ఎన్‌ చిన్నస్వామి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పీ రాజ సులోచన, జే బాబురావు, జిల్లా కార్యదర్శులు నల్లూరి వెంకటేశ్వరరావు, సీహెచ్‌ ప్రభాకర్‌ రెడ్డి, ఎం సంధ్యారాణి, వైఎస్‌ఎన్‌ జ్యోతి, మీదిగ శీను, టీ రాజశేఖర్‌, పీ రామాంజనేయులు, ఎస్‌డీవీ ప్రసాద్‌, ఎం మాలకొండయ్య, జీ మధుసూదన్‌ రావు, పీ వలిఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement