● ఘనంగా కళ్యాణ గజోత్సవం
మర్రిపూడి: జిల్లాలో ప్రసిద్ధి గాంచిన లక్ష్మీనృసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి కల్యాణం మంగళవారం రాత్రి కనులపండువగా సాగింది. వేదమంత్రాలు, భాజాభజంత్రీల నడుమ కల్యాణం నిర్వహించారు. అర్చకులు నారాయణం మారుతీ చార్యులు, నారాయణం శ్రీనివాసాచార్యులు, నారాయణం తిరుమలా చార్యులు, వేంకటసాయి చార్యులు కల్యాణ ఘట్ట్టాన్ని జరిపించారు. కల్యాణాన్ని తిలకించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు వేల సంఖ్యలో కొండకు చేరుకున్నారు. ఆలయ ఆవరణలో భక్తులతో కిక్కిరిసింది.
ఘనంగా గజోత్సవం
శ్రీలక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి ఎదురుకోల ఉత్సవం, గజోత్సవం ఘనంగా నిర్వహించారు. రాజ్యలక్ష్మీసహితుడైన నృసింహుని పూలమాలలతో ప్రత్యేకంగా అలంకరించి ముందుగా ఎదురుకోల ఉత్సవం చేశారు. అనంతరం స్వామి ప్రతిమలను పూలమాలలతో ప్రత్యేకంగా అలంకరించి పల్లకిపై ఉంచి ఆలయం చుట్టూ ఊరేగించారు. కుప్పం పెద కొల్లారావు, కుప్పం చిన కొల్లారావు, ప్రసాదు, సత్యన్నారాయణ, బీఎల్‌ఎన్ శాసీ్త్ర అన్నదమ్ములు, కుమారులు ఉభయదాతలుగా వ్యహరించారు. ఆలయాన్ని విద్యుత్‌దీపాలతో ప్రత్యేంగా అలంకరించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు.
కల్యాణం తిలకిస్తున్న భక్తులు (ఇన్‌సెట్) కల్యాణం జరిపిస్తున్న వేదపండితులు
పల్లకిపై లక్ష్మీ నృసింహ స్వామి ఊరేగింపు


