రెడ్డి జనాభ్యుదయ సంఘ సేవలు ప్రశంసనీయం | - | Sakshi
Sakshi News home page

రెడ్డి జనాభ్యుదయ సంఘ సేవలు ప్రశంసనీయం

Mar 4 2026 7:19 AM | Updated on Mar 4 2026 7:19 AM

రెడ్డి జనాభ్యుదయ సంఘ సేవలు ప్రశంసనీయం ఘాట్‌ రోడ్డులో అదుపుతప్పిన క్రేన్‌ 15న అక్షరాంధ్ర ఫైనల్‌ పరీక్ష

ఒంగోలు వన్‌టౌన్‌: ఒంగోలులోని రెడ్డి జనాభ్యుదయ సంఘం పేద విద్యార్థులకు చేస్తున్న సేవలు అమోఘమని ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎన్‌ఆర్‌ఐ ఆలూరుకు చెందిన గాదె శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. మామిడిపాలెంలోని రెడ్డి హాస్టల్‌ను ఆయన మంగళవారం సందర్శించి హాస్టల్‌ యాజమాన్యంతో కలిసి హాస్టల్‌ ప్రాంగణాన్ని పరిశీలించారు. విద్యార్థుల వసతి కోసం మూడవ అంతస్తు నిర్మాణాన్ని తన సొంత నిధులతో నిర్మిస్తామని చెప్పారు. భవన నిర్మాణానికి ఈ నెల 8న శంకుస్థాపన చేస్తామన్నారు. హాస్టల్‌లో చదివిన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డిని సంఘ అధ్యక్షుడు కేవీ రమణారెడ్డి, కార్యదర్శి అన్నపురెడ్డి ఆదిరెడ్డి ఆధ్వర్యంలో సన్మానించారు. కార్యక్రమంలో శేషి రెడ్డి, శంకర్‌రెడ్డి, నరసింహారెడ్డి, రామసుబ్బారెడ్డి, వెంకట్రామిరెడ్డి, మల్లికార్జునరెడ్డి, సంజీవరెడ్డి, శ్రీనివాసరెడ్డి, యుగంధర్‌రెడ్డి, సుబ్బారెడ్డి, వినయ్‌కుమార్‌రెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, శివ రామిరెడ్డి, వేణుగోపాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కొత్తపట్నంలో చోరీ

రూ.2.30 లక్షల విలువైన బంగారం, నగదు చోరీ

కొత్తపట్నం: మండలంలో కొత్తపట్నంలో చోరీ జరిగింది. వివరాల్లోకి వెళితే..గ్రామానికి చెందిన పురిణి సరోజినీ ఇంట్లో మరమ్మతులు చేయిస్తున్నారు. ఈ క్రమంలో రాత్రిళ్లు తన తండ్రి రఘురాములు ఇంటికి వెళ్లి నిద్రిస్తున్నారు. మంగళవారం ఉదయం ఇంటికి వచ్చి ఉండగా బీరువా పగులగొట్టి ఉంది. అందులోని రూ.72 వేల నగదు, నాలుగు సవర్ల బంగారు ఆభరణాలు అపహరించారు. దీంతో స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వేలిముద్రలు సేకరించారు. ఎస్సై వేముల సుధాకర్‌బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నాలుగు గంటలపాటు స్తంభించిన ట్రాఫిక్‌

మార్కాపురం: తర్లుపాడు మండల పరిధిలోని కర్నూలు–ఒంగోలు హైవేపై తాడివారిపల్లి ఘాట్‌ రోడ్డులో సోమవారం రాత్రి 11 గంటల సమయంలో క్రేన్‌ అదుపు తప్పి రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. పొదిలి వైపు నుంచి తాడివారిపల్లి వైపు వెళ్తున్న క్రేన్‌ అదుపు తప్పి రోడ్డుకు అడ్డంగా పడటంతో సుమారు 4 గంటల పాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఆర్టీసీ, ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులు, లారీలు, కార్లు ట్రాఫిక్‌లో చిక్కుకోవడంతో వాహనదారులంతా అవస్థలు పడ్డారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని క్రేన్‌ను పక్కకు తొలగించి, ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.

మార్కాపురం టౌన్‌: అక్షరాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా బుధవారం ప్రీఫైనల్‌, ఈ నెల 15వ తేదీన ఫైనల్‌ పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్‌ రాజాబాబు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 1,00,900 మందిని అక్షరాంధ్రలో నమోదు చేశామని, అభ్యాసకుల సంసిద్ధత కార్యక్రమంలో భాగంగా ప్రీఫైనల్‌ పరీక్ష నిర్వహిస్తున్నామని మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. స్వయం సహాయక సంఘాలు, శ్రమ శక్తి సంఘాల్లోని సీ్త్ర, పురుషులకు వలంటరీ టీచర్లతో గ్రామాల్లో శిక్షణ ఇచ్చినట్లు వయోజన విద్య జిల్లా డీడీ బి.జగన్‌మోహన్‌రావు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement