● ప్రత్యేక పూజలు చేసిన మాజీ మంత్రి పేర్ని నాని, చింతలపూడి
అద్దంకి రూరల్: కూటమి ప్రభుత్వం లేనిపోనివి సృష్టించి తిరుమల లడ్డూ కల్తీ అంటూ అసత్య ప్రచారాలతో కాలం వెళ్లదీస్తోందని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. శింగరకొండ తిరునాళ్ల సందర్భంగా మాజీ మంత్రి పేర్ని నాని, అద్దంకి నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జ్ డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్, ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జ్ చుండూరి రవిబాబు సోమవారం రాత్రి ప్రసన్నాంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. వారికి వేదపండితులు ఆశీర్వచనం ఇచ్చి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. తరువాత వైఎస్సార్ సీపీ సానుభూతిపరులు కొత్తరెడ్డిపాలెం, అద్దంకి టౌన్ నాయకులు ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభలను సందర్శించారు. ఈ సందర్భంగా చింతలపూడి అశోక్ కుమార్ మాట్లాడుతూ 2029 ఎన్నికల్లో అద్దంకిలో వైఎస్సార్ సీపీ జెండా ఎగురవేయాలన్నారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు కాకాని రాధాకృష్ణమూర్తి, అద్దంకి మండల కన్వీనర్ గుజ్జుల జగన్‌మోహన్‌రెడ్డి, బల్లికురవ మండల కన్వీనర్ దేవినేని కృష్ణబాబు, కొరిశపాడు మండల కన్వీనర్ పాలపర్తి శ్రీధర్, పార్టీ జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు ఈదా శ్రీనివాసరెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.


