వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతి | - | Sakshi
Sakshi News home page

వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతి

Mar 2 2026 7:26 AM | Updated on Mar 2 2026 7:26 AM

వేర్వ

వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతి

గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ప్రమాదం

అద్దంకి: గుర్తు తెలియని వాహనం ఢీకొని బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. ఈ ఘటన ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత అద్దంకి–నార్కెట్‌పల్లి రాష్ట్రీయ రహదారిలో మధురానగర్‌ సమీపంలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం..మండలంలోని కొంగపాడు ఎస్సీ కాలనీకి చెందిన ఏసపోగు వినోద్‌(28), ఎచ్చెర్ల చిన్నా(22) పచ్చాకు కూలీ పనులు చేసుకుంటూ జీవన సాగిస్తున్నారు. వినోద్‌కు వివాహమై ఇద్దరు పిల్లలు ఉండగా, చిన్నాకు వివాహం కాలేదు. వీరిద్దరు ఆదివారం పని నిమిత్తం బైకుపై అద్దంకికి వచ్చారు. పనులు ముగించుకుని, బైక్‌పై తిరిగి స్వగ్రామానికి వెళుతుండగా రాష్ట్రీయ రహదారిలో మధురానగర్‌ సమీపంలోకి రాగానే వెనుక నుంచి వస్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. వినోద్‌ భార్య అనిత, చిన్నా తల్లి నవనీతం ఫిర్యాదు మేరకు పోలీసులు మృతదేహాలను అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

రెండు కుటుంబాల్లో విషాదం

ఒకే రోజు రెండు కుటుంబాలకు చెందిన ఆశల దీపాలు ఆరిపోవడంతో ఆ రెండు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. వందేళ్లు తనకు తోడుంటాడనుకున్న భర్త మరణంతో వినోద్‌ భార్య, తమ కుమారుడు మృతితో చిన్నా తల్లి మృతదేహాలను చూసి తల్లిడిల్లిపోయారు.

గుర్తు తెలియని వాహనం ఢీకొని వృద్ధుడు మృతి

కొత్తపట్నం: గుర్తు తెలియని వాహనం ఢీకొని వృద్ధుడు మృతి చెందాడు. పోలీసుల వివరాల మేరకు.. ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రం జాలన్‌ జిల్లా, ఎయిర్‌ గ్రామానికి చెందిన అశ్రపి (63) పానీపూరి బండి నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం రాత్రి తను స్వగ్రామానికి కుమారుడు నరేంద్రతో కలిసి ఆటోలో వెళుతున్నారు. ఒంగోలు నుంచి గుర్తు తెలియని వాహనం కొత్తపట్నం సమీపంలో మార్కెట్‌ యార్డ్‌ ఎదురుగా వచ్చే సరికి ఆటోను ఢీకొట్టింది. ప్రమాదంలో ఆశ్రపికి బలమైన గాయాలు కావడంతో ఒంగోలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. ఎస్సై సుధాకర్‌ సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

ఉలవపాడు: రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ సంఘటన మండల పరిధిలోని జాతీయరహదారిపై కరేడు ర్యాంపు వద్ద ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఉలవపాడు వరిగచేను సంఘంకు చెందిన పోట్లూరి కోటేశ్వరరావు, పోట్లూరి రమేష్‌ ద్విచక్రవాహనంపై సింగరాయకొండ వెళుతూ ముందు వెళుతున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి కిందపడిపోయారు. ఇద్దరికి గాయాలయ్యాయి. ముందు వాహనం నడుపుతున్న వ్యక్తికి ఎలాంటి గాయాలు కాలేదు. గాయాలైన ఇద్దరిని 108 సిబ్బంది ఉలవపాడు సీహెచ్‌సీ వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతి 1
1/2

వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతి

వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతి 2
2/2

వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement