చంపేస్తామని బెదిరిస్తున్నారు
● రక్షణ కల్పించండని మహిళ ఆవదేన
గిద్దలూరు రూరల్: కూటమి ప్రభుత్వంలో రెడ్‌బుక్ పాలనతో గ్రామాల్లో భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని ఆర్టీసీ డిపో సమీపంలో ఉన్న వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్ద ఓ ఇంటి వద్దకు శనివారం సుమారు 50 మంది వచ్చారు. ఆ సమయంలో ఇంట్లో మహిళ ఒక్కరే ఉన్నారు. అంత మంది ఒక్కసారిగా రావడంతో ఆమె భయభ్రాంతులకు గురై పోలీసులకు, 100కు సమాచారం ఇచ్చింది. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. బాధితురాలు మదిరె ప్రభావతి తెలియజేసిన వివరాల ప్రకారం రాచర్ల మండలం ఎడవల్లి పరిధిలో 781 సర్వే నంబర్‌లో తన భర్త నెమిరెడ్డి పేరుపై 2000లో 5 ఎకరాలు భూమి ఇచ్చారు. తరువాత 2002, 2003 మధ్య కాలంలో లెదర్ పార్కు కోసం ప్రభుత్వం అదే సర్వే నంబర్‌లో ఉన్న మరి కొంత భూమి 25 ఎకరాల మేర లేదర్ పార్కు కోసం కేటాయించి అక్కడ లెదర్ పార్కు షెడ్డు నిర్మాణం చేశారు. ఇటీవల కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత ఎటువంటి సమాచారం లేకుండా తమ పొలంలో నుంచి దౌర్జన్యంగా లెదర్ పార్కుకు రోడ్డు వేసేందుకు ప్రయత్నించారు. దీంతో తన భర్త నెమిలిరెడ్డి న్యాయం చేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు మా విన్నపాన్ని ఆలకించి రోడ్డు పనులు నిలుపుదల చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయం మింగుడు పట్టని కొందరు టీడీపీ నాయకులు ఫోన్ చేస్తూ బెదిరిస్తున్నారని వాపోయింది. అయినా తాము గట్టిగా నిలబడటంతో టీడీపీ నాయకులు మరింత కక్ష పెట్టుకొని ఇంటికిపైగా గుంపులు గుంపులుగా వచ్చి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీకి సానుకూలంగా ఉన్నామని తమకు ఇచ్చిన పొలంలో అక్రమంగా రోడ్డు వేసి తమను ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేయాలని చూస్తున్నారని చెప్పారు. తన భర్త ఇంట్లో లేని సమయంలో సుమారు 50 మంది ఇంటి మీదకు వచ్చి రోడ్డు పనులను నిలుపుదలు చేస్తారా చంపేయమంటారా అంటూ బెదిరిస్తున్నారని వాపోయారు. మహిళ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో దౌర్జన్య చేయడం అంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. నా భర్తకు ప్రాణహాని ఉందని, తమకు పూర్తిగా రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు.
చంపేస్తామని బెదిరిస్తున్నారు


