‘అల్లుకున్న’ ప్రతిభ
● ఒక్కడే 1150 పొగాకు కర్రలు అల్లిన వైనం
తాళ్లూరు: ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలంలోని కొర్రపాటివారిపాలెం గ్రామానికి చెందిన పూరిమిట్ల బాబు పొగాకు (పచ్చాకు) అల్లికలో ఒక్కడే 1150 పొగాకు కర్రలు అల్లి ప్రతిభ కనబరిచాడు. అదే గ్రామానికి చెందిన మేసీ్త్ర ఆర్ చంద్రపాల్ ముఠాలో ప్రతి రోజు పొగాకు పని చేయటంలో భాగంగా బ్యార్నీకి ఆకు అల్లటానికి వెళ్తుంటారు. సాధారణంగా ఒక బ్యార్నీకి పచ్చాకు (పొగాకు) అల్లాలంటే 8 మంది మగవాళ్లు, 16 మంది మహిళలు అవసరమవుతుంది. కానీ ఆదివారం అద్దంకి మండలం దేనవకొండ గ్రామానికి చెందిన అన్యం ప్రసాద్ అనే రైతుకి బ్యార్నీకి పొగాకు పూరిమిట్ల బాబు ఇద్దరి మహిళల సహాయంతో 1150 కర్రలను అల్లాడు. దీంతో గ్రామ రైతులు, కూలీలు ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రతిభ కనబరిచిన పూరిమిట్ల బాబుకు రైతు ప్రసాద్ కూలీ డబ్బులతో పాటు అదనపు బహుమతిగా రూ.3116 నగదు అందజేశారు.


