విద్యుదాఘాతానికి ఒకరికి తీవ్ర గాయాలు | - | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతానికి ఒకరికి తీవ్ర గాయాలు

Mar 4 2026 7:19 AM | Updated on Mar 4 2026 7:19 AM

గాయపడిన నలబోలు కొండారెడ్డి

సబ్‌స్టేషన్‌ ఎదుట ఆందోళన చేస్తున్న బంధువులు

సబ్‌స్టేషన్‌ ఎదుట బంధువుల ఆందోళన

పీసీపల్లి: విద్యుదాఘాతానికి ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే..జంగాలపల్లికి చెందిన నల్లబోలు కొండారెడ్డి చిన్నచిన్న విద్యుత్‌ పనులు చేస్తుండేవాడు. ఈ క్రమంలో మంగళవారం విద్యుత్‌ అధికారులు ఎవరూ అందుబాటులోకి రాకపోవడంతో పీసీపల్లికి చెందిన నూకతోటి మాలకొండయ్య లైన్‌మన్‌ సులోమన్‌కు ఫోన్‌ చేశాడు. సులోమన్‌ ఎల్‌సీ ఇస్తాను, జంగాపల్లికి చెందిన కొండారెడ్డిని పిలిపించుకొని హెడ్‌ ఫీజు వేసుకొని సలహా ఇచ్చారు. ఆ తరువాత సబ్‌స్టేషన్‌లో షిఫ్ట్‌ ఆపరేషటర్‌ గోపాల్‌, లైన్‌మెన్‌ సులేమాన్‌, ప్రైవేట్‌ వ్యక్తి కొండారెడ్డి ముగ్గురు ఫోన్‌ లైన్‌లో ఉండి కొండారెడ్డిని స్తంభం ఎక్కమని చెప్పారు. అయితే ఎల్‌సీ ఇచ్చిన వెంటనే మళ్లీ మారెళ్ల ఫీడర్‌కు కరెంట్‌ ఇవ్వడంతో కొండారెడ్డికి విద్యుదాఘాతానికి గురై కిందపడి తీవ్ర గాయాలయ్యాయి. కుడికాలు, కుడి చేయి, ఎడుమచేయికి తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో బంధువులు హుటాహుటిన పీసీపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం ఒంగోలుకు తరలించారు.

సబ్‌స్టేషన్‌ ఎదుట బంధువుల ఆందోళన

అయితే విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే కొండారెడ్డి విద్యుదాఘాతానికి గురయ్యాడని గ్రామస్తులు సబ్‌స్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగారు. అక్కడ నుంచి విద్యుత్‌ శాఖ ఉన్నతాధికారులకు ఫోన్‌లో ఫిర్యాదు చేశారు. ఆందోళనలో రైతులు ఓబుల్‌ రెడ్డి, నాగిరెడ్డి, పెసల నరసింహారెడ్డి, కసిరెడ్డి మాలకొండయ్య, నలబోలు నారాయణ, నలబోలు కష్ణారెడ్డి, నలబోలు చిన్నపరెడ్డి, సాదు వెంకటేశ్వర్లు, పెసల కొండారెడ్డి, వెలుతుర్ల ప్రభాకర్‌ రెడ్డి, గంగిశెట్టి నరసింహంలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement