వర్షంలో ఫుడ్‌ ఆర్డర్‌ చేస్తే ‘రెయిన్‌ ఫీజు’పై జీఎస్టీ | Rain Fee + GST: Online Food Orders Costlier on Zomato & Swiggy Amid GST Reform | Sakshi
Sakshi News home page

వర్షంలో ఫుడ్‌ ఆర్డర్‌ చేస్తే ‘రెయిన్‌ ఫీజు’పై జీఎస్టీ

Sep 23 2025 12:34 PM | Updated on Sep 23 2025 1:02 PM

humorous post on X viral Swiggy bill showing rain fee plus GST

జోరువానలో బయటకు వెళ్లలేక ఆన్‌లైన్‌లో ఫుడ్‌ ఆర్డర్‌ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే.. జొమాటో, స్విగ్గీ.. వంటి ఆన్‌లైన్‌ ఫుడ్‌ అగ్రిగేటర్ల ఆర్డుర్లు ఇకపై మరింత భారం కాబోతున్నాయి. వర్షం వస్తున్నప్పుడు ఆర్డర్‌ బుక్‌ చేస్తే దానిపై రెయిన్‌ ఫీజు వసూలు చేస్తున్నారు. ఆ రెయిన్‌ ఫీజుపై జీఎస్టీ సైతం విధిస్తున్నారు. ఈమేరకు సామాజిక మాధ్యమాల్లో వెలసిన ఓ పోస్ట్‌ వైరల్‌గా మారింది.

గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్(జీఎస్టీ) కౌన్సిల్ తన ఇటీవలి సంస్కరణల్లో స్థానిక ఈ-కామర్స్ డెలివరీ సేవలను సీజీఎస్టీ చట్టంలోని సెక్షన్ 9(5) కిందకు తీసుకువచ్చింది. దాంతో ఈ ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ అగ్రిగేటర్‌ ప్లాట్‌పామ్‌లు వసూలు చేసే ఫీజులు ప్రభావితం అయ్యాయి. డెలివరీ ఫీజుపై ఇప్పుడు 18 శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నారు. సవరించిన రేట్లు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చాయి.

సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన పోస్ట్‌ ప్రకారం.. ‘జీఎస్టీ క్రమబద్ధీకరణ తర్వాత వర్షం కురిపించే ఇంద్ర దేవుడు కూడా జీఎస్టీ పరిధిలోకి వచ్చాడు. నేను చేసిన ఓ ఆన్‌లైన్‌ ఫుడ్‌ ఆర్డర్‌పై రూ.25 రెయిన్‌ ఫీజు వసూలు చేస్తూ.. దానిపై 18 శాతం జీఎస్టీ..రూ.4.5 విధించారు. తర్వాత సన్‌లైట్‌ కన్వినెయెన్స్‌ ఫీజు, ఆక్సీజన్‌ మెయింటనెన్స్‌ ఫీజు..మనం తీసుకునే శ్వాసపై కూడా ట్యాక్స్‌ వేస్తారేమో!’ అని అశిష్‌గుప్తా అనే వ్యక్తి రాసుకొచ్చారు. ఇదికాస్తా వైరల్‌గా మారింది. దాంతో నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు.

ఇదీ చదవండి: ఒకేరోజు భారీగా పెరిగిన బంగారం ధర.. ఎంతంటే..

నెటిజన్ల స్పందన..

1. తర్వాత వారు స్మైలింగ్‌ ట్యాక్స్‌ విధిస్తారు.

2. డెలివరీ బాయ్స్‌ అందుకే వర్షంలోనూ యాప్స్‌ స్విచ్‌ఆఫ్‌ చేయడం లేదు. ఇలాంటి సందర్భంలో సర్వీస్‌ చేస్తే వారికి డబ్బు వస్తుంది కదా.

3. రూ.25 ఫీజు తీసుకుంటున్నా డెలివరీ భద్రంగా చేస్తున్నారా? అని కామెంట్‌ రాశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement