AP: స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడనం | Moderate to heavy rain forecast for Rayalaseema | Sakshi
Sakshi News home page

AP: స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడనం

Dec 16 2024 4:42 AM | Updated on Dec 16 2024 10:39 AM

Moderate to heavy rain forecast for Rayalaseema

నేడు తీవ్ర అల్పపీడనంగా మారే ఛాన్స్‌

సాక్షి, విశాఖపట్నం: దక్షిణ అండమాన్‌ సము­ద్రంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడ­నం స్థిరంగా కొనసాగుతోంది. రాబోయే 24 గంటల్లో ఇది బలపడి తీవ్ర అల్పపీడనంగా మారనుంది. అనంతరం దిశ మార్చుకుని పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణిస్తుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

18వ తేదీన ఉదయం తమిళనాడు రాష్ట్రంలో తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించారు. దీని ప్రభావంతో మంగళవారం దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నా­యని తెలిపారు. తీరం వెంబడి 30 నుంచి 35 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని.. దక్షిణ కోస్తా జిల్లాల్లోని మత్స్యకారులు ఈ నెల 18 వరకూ వేటకు వెళ్లవద్దని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.  

	బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

Advertisement
 
Advertisement
Advertisement