తెలుగు రాష‍్ట్రాలకు రెయిన్‌ అలర్ట్‌.. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు | Imd Issues Rain Alert To Telangana And Andhra Pradesh | Sakshi
Sakshi News home page

తెలుగు రాష‍్ట్రాలకు రెయిన్‌ అలర్ట్‌.. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు

May 1 2025 9:31 AM | Updated on May 1 2025 11:43 AM

Imd Issues Rain Alert To Telangana And Andhra Pradesh

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో 21 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. 17 జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ను అధికారులు జారీ చేశారు.

కోస్తాంధ్రలో ఒక్కసారిగా మారిన వాతావరణం
కోస్తాంధ్రలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. రాయలసీమలో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. పలు చోట్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది.

తెలుగు రాష్ట్రాల్లో కొన్ని రోజులుగా వాతావరణంలో భిన్నమైన మార్పులు జరుగుతున్నాయి. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో విపరీతమైన ఎండలు, వడగాల్పులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇక కొన్ని చోట్ల కురిసిన అకాల వర్షాలకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

 

 

 

 

Advertisement
 
Advertisement
Advertisement