హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం | heavy rain in hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం

Nov 2 2025 7:12 PM | Updated on Nov 2 2025 7:55 PM

heavy rain in hyderabad

సాక్షి,హైదరాబాద్‌: హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. నగరంలో ఆదివారం సాయంత్రం బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట, మియాపూర్‌, చందానగర్‌, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్‌, సికింద్రాబాద్‌, తిరుమలగిరి, అల్వాల్‌, బొల్లారం, జవహార్‌ నగర్‌ ప్రాంతాల్లో వర్షం ముమ్మరంగా కురవడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.

వర్షం తీవ్రతకు లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. పలు రహదారులు జలమయం కావడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్రాఫిక్‌ జామ్‌లు ఏర్పడిన చోట్ల పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను నియంత్రిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. 

 

 

హైదరాబాద్‌తో పాటు యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. చౌటుప్పల్‌, నారాయణపురం, పోచంపల్లి ప్రాంతాల్లో వర్షం కారణంగా వ్యవసాయ రంగానికి నష్టం వాటిల్లింది. చౌటుప్పల్‌ మార్కెట్‌ యార్డులో నిల్వ ఉన్న ధాన్యం తడిసిన ఘటన రైతులను ఆందోళనకు గురిచేసింది. అధికారులు వెంటనే స్పందించి ధాన్యాన్ని కాపాడే చర్యలు చేపట్టారు.

వాతావరణ శాఖ ప్రకారం, ఈ వర్షాలు మరో రెండు రోజులు కొనసాగే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే మాత్రమే బయటకు రావాలని సూచించారు. అత్యవసర సేవల కోసం నగర పాలక సంస్థ ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement