2 రోజుల పాటు దక్షిణకోస్తా, రాయలసీమకు వర్ష సూచన | Rain forecast for South Coast and Rayalaseema for 2 days | Sakshi
Sakshi News home page

2 రోజుల పాటు దక్షిణకోస్తా, రాయలసీమకు వర్ష సూచన

Nov 11 2024 4:40 AM | Updated on Nov 11 2024 6:05 AM

Rain forecast for South Coast and Rayalaseema for 2 days

సాక్షి, విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం.. ప్రస్తుతం సముద్రమట్టానికి 3.6 కిమీ ఎత్తులో విస్తరించి ఉంది. దీని ప్రభావంతో మంగళవారం నాటికి అల్పపీడనం ఏర్పడే సూచనలున్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. 

ఇది అల్పపీడనంగా మారిన తర్వాత పశ్చిమ దిశగా కదులుతూ తమిళ­నాడు, శ్రీలంక వైపుగా పయనిస్తూ..14వ తేదీ రాత్రి లేదా 15వ తేదీ ఉదయం తీరం దాటనుందని తెలిపారు. దీని ప్రభావంతో నేడు దక్షిణకోస్తా, రాయలసీమ జిల్లాల్లో పలు­చోట్ల వర్షాలు, రేపు మోస్తరు నుంచి ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశాలున్నా­యని పేర్కొన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement