తాడేపల్లిలో ‘పచ్చ’ డ్రామా | Another conspiracy by Chandrababu government | Sakshi
Sakshi News home page

తాడేపల్లిలో ‘పచ్చ’ డ్రామా

Sep 22 2026 4:57 AM | Updated on Sep 22 2026 4:57 AM

Another conspiracy by Chandrababu government

తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న పచ్చ బ్యాచ్‌

పరీక్షలు లేకుండా వీఏఎస్‌ పోస్టులు కట్టబెట్టే  ప్రయత్నాన్ని అడ్డుకోవడంపై చంద్రబాబు కూటమి అక్కసు 

డీఎస్సీ అక్రమాల నుంచి ప్రజల దృష్టి మళ్లించే యత్నం 

నిరుద్యోగుల పేరుతో వైఎస్సార్‌సీపీ కార్యాలయం వద్ద కొందరు గొడవ 

ఐటీడీపీ సోషల్‌ మీడియాను వెంట తెచ్చుకొని హంగామా 

పరీక్షలు లేకుండా వీఏఎస్‌ పోస్టులు కట్టబెట్టాలంటూ డిమాండ్‌ 

పసుపు రంగు ప్లకార్డు చేతపట్టుకొని నినాదాలు.. 

విజయవాడలో వైఎస్సార్‌సీపీ ఆందోళన ముగియగానే ఇక్కడి వారూ మాయం

సాక్షి, అమరావతి: డీఎస్సీలో అక్రమాలతో అర్హు­లైన యువతకు ఉద్యోగాలు దక్కకుండా చేసి, అనర్హులకు పోస్టులు కట్టబెట్టడంపై వైఎస్సార్‌సీపీ పెద్ద ఎత్తున చేపట్టిన ఉద్యమం నుంచి ప్రజలను పక్కదారి పట్టించే డైవర్షన్‌ డ్రామాల్లో చంద్రబాబు సర్కారు మరో అంకానికి తెరలేపింది. ఆంధ్రప్రదేశ్‌ నిరుద్యోగ వెటర్నరీ గ్రాడ్యుయేట్లు అండ్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్ల సంఘం పేరుతో కొందరిని వైఎస్సార్‌సీపీ కార్యాలయంపైకి పంపింది.

వారికి తోడుగా తెలుగుదేశం పార్టీకి చెందిన ఐటీడీపీ వారిని కెమెరాలతో పంపింది. వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ (వీఏఎస్‌) పోస్టులకు పరీక్షలు నిర్వహించడానికి వైఎస్సార్‌సీపీ కారణమంటూ సోమవారం వారంతా తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం వద్ద గొడవకు దిగారు. వారంతా పసుపు రంగు ప్లకార్డులు ప్రదర్శించారు. ఏ పరీక్షా లేకుండా ఈ పోస్టులను భర్తీ చేయాలంటూ నినాదాలు చేశారు.  

డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటా తరహాలోనే పశు వైద్యుల పోస్టు (వీఏఎస్‌ పోస్టు)లను ఎటువంటి పరీక్షలు లేకుండా తాము కోరుకున్న వారికి కట్టబెట్టేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రయతి్నంచింది. దీనిపై ‘సాక్షి’లో వరుస కథనాలు ప్రచురించటంతో ప్రభుత్వం విధిలేని పరిస్థితుల్లో వెనక్కు తగ్గింది. ఏపీపీఎస్సీ ద్వారా పరీక్ష నిర్వహించి పోస్టులు భర్తీ చేసేలా ఉత్తర్వులు జారీ చేసింది. మరోపక్క చంద్రబాబు కూటమి నేతలు వీఏఎస్‌ పోస్టుల అభ్యర్థుల పేరుతో కొందరిని వైఎస్సార్‌సీపీ పైకి ఉసిగొల్పారు. డీఎస్సీలో అక్రమాలపై సోమవారం వైఎస్సార్‌సీపీ విజయవాడలోని శాప్‌ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగిన సమయంలోనే వీరు తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయం వద్ద ప్రత్యక్షమయ్యారు.

వీఏఎస్‌ పోస్టులకు పరీక్ష వద్దంటూ నినాదాలు చేస్తూ ధర్నాకు దిగారు. ‘పరీక్షలు రాయం.. ఉద్యోగాలు ఇవ్వాలి.. ప్రభుత్వం పరీక్షలు లేకుండా ఉద్యోగాలు ఇస్తే మీకేమి నొప్పి’ అంటూ కొందరు అనటం అందరినీ ఆశ్చర్యపరిచింది. వైఎస్సార్‌సీపీ లీగల్‌ సెల్‌ అధ్యక్షుడు మలసాని మనోహర్‌రెడ్డి వారి వద్దకు వచ్చి ఎంత సర్ది చెప్పినా వారు మరింత రెచి్చ­పోయి.. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను రెచ్చగొట్టేలా నినాదాలు చేశారు. విజయవాడలో శాప్‌ కార్యాలయం వద్ద వైఎస్సార్‌సీపీ ఆందోళన ముగియగానే వైఎస్సార్‌సీపీ కార్యాలయం వద్ద గొడవ చేస్తున్న వారికి టీడీపీ కార్యాలయం నుంచి సమాచారం అందింది. ఆ వెంటనే వారంతా అక్కడి నుంచి వెళ్లిపోవడం కొసమెరుపు.

తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న పచ్చ బ్యాచ్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement