కాన్‌బెర్రా వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి టీ20 వర్షం కారణంగా రద్దు అయింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ తొలుత టీమిండియాను బ్యాటింగ్ అహ్హనించాడు. అయితే భారత ఇన్నింగ్స్ ఐదవ ఓవర్ ముగిసిన వెంటనే వరుణుడు ఎంట్రీ ఇచ్చాడు. దీంతో ఆటను అంపైర్‌లు నిలిపివేశారు. వర్షం పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో తిరిగి ఆటను ప్రారంభించారు.
అయితే మ్యాచ్‌ను మాత్రం 18 ఓవర్లకు కుదించారు. తిరిగి క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్, శుభ్‌మన్ గిల్ ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఇద్దరు బ్యాటర్లు మంచి జోరు మీద ఉన్న సమయంలో వర్షం మళ్లీ ఎంట్రీ ఇచ్చింది. భారత్ స్కోర్ 97/1(9.4 ఓవర్లు) వద్ద ఆటను నిలిపివేశారు.
అయితే ఈసారి వర్షం తగ్గుముఖం పట్టే సూచనలు కన్పించకపోవడంతో అంపైర్‌లు మ్యాచ్‌ను రద్దు చేశారు. ఫలితం తేలని ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్(39 నాటౌట్), శుభ్‌మన్ గిల్(37 నాటౌట్), అభిషేక్ శర్మ 19 పరుగులు చేశారు. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ20 మెల్‌బోర్న్ వేదికగా శుక్రవారం జరగనుంది.
తుదిజట్లు:
టీమిండియా
అభిషేక్ శర్మ, శుబ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా.
ఆస్ట్రేలియా
మిచెల్ మార్ష్(కెప్టెన్), ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, మిచెల్ ఓవెన్, మార్కస్ స్టొయినిస్, జోష్ ఫిలిప్, జేవియర్ బార్ట్‌లెట్, నాథన్ ఎల్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, జోష్ హాజిల్‌వుడ్.
చదవండి: IND vs AUS: ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్.. టీమిండియాకు భారీ షాక్


