
ఒకటి, రెండు చోట్ల మోస్తరు వర్షాలు
రానున్న 3 రోజులు సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న రెండు రోజులు పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకా శం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ తె లంగాణ ప్రాంతం నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఇది సముద్రమట్టం నుంచి సగటు న 0.9 కిలోమీటర్ల ఎత్తువరకు ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని దక్షిణ ప్రాంత జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు, ఒకట్రెండు చోట్ల మోస్తరు వ ర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
శుక్రవారం రాష్ట్రంలోని ప్రధాన నగరా ల్లో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే.. ఆదిలాబాద్ లో 40.3 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత, మెద క్‌లో 22.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రా ష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగానే నమోదయ్యాయి. హనుమకొండలో గరిష్ట ఉష్ణో గ్రత సాధారణం కంటే 4.1 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదైంది. అలాగే భద్రాచలంలో 3.8 డిగ్రీల సెల్సి యస్ తక్కువగా నమోదు కాగా.. మిగిలిన ప్రాంతాల్లో 1 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ తక్కువగా న మోదైంది. కనిష్ట ఉష్ణోగ్రత చాలాచోట్ల సాధారణం కంటే తక్కువగా ఉంది. రానున్న 3 రోజులు గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతాయని వాతావరణ శాఖ వివరించింది.
పిడుగుపాటుతో రైతు మృతి
అశ్వారావుపేట రూరల్: పిడుగుపాటుతో ఓ రైతు అక్కడికక్కడే మృతిచెందగా, ఇద్దరు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లికి చెందిన సాధనం రాజారావు (42) శుక్రవారం సాయంత్రం తన బంధువుల పిల్లలతో కూరగాయల తోటకు వెళ్లాడు. కూరగాయలు కోస్తుండగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో పిల్లలు సాయిల తేజ, బాలుతో పాటు రాజారావు సమీపంలోని వేపచెట్టు కిందకు వెళ్లాడు. అదే సమయంలో పిడుగు పడటంతో రాజారావు మృతిచెందగా, కొంచెం దూరంలో ఉన్న తేజ, బాలు అస్వస్థతకు గురయ్యారు. కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడైన మృతుడు రాజారావుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మృతుని కుటుంబాన్ని పరామర్శించారు.