Mumbai: వర్ష బీభత్సం.. రెండు రోజులు రెడ్‌ అలర్ట్‌.. విద్యాసంస్థలకు సెలవు | Mumbai Rain Red Alert School Closed | Sakshi
Sakshi News home page

Mumbai: వర్ష బీభత్సం.. రెండు రోజులు రెడ్‌ అలర్ట్‌.. విద్యాసంస్థలకు సెలవు

Aug 18 2025 1:45 PM | Updated on Aug 18 2025 3:01 PM

Mumbai Rain Red Alert School Closed

ముంబై: ముంబైలో వరుసగా మూడవ రోజు సోమవారం కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపధ్యంలో వాతావరణశాఖ నగరంతో పాటు చుట్టుపక్కల జిల్లాలకు రెండు రోజుల పాటు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.  
 

దీంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. వాహనదారులు తెగ ఇబ్బందులు పడుతున్నారు. ముంబైలోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సోమవారం సెలవు ప్రకటించింది. భారీ వర్షం కారణంగా పలు రోడ్లు జలమయం అయ్యాయి. అంధేరి సబ్వే , లోఖండ్వాలా కాంప్లెక్స్ తదితర లోతట్టు ప్రాంతాలలో నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.

సబర్బన్ రైళ్లు 15 నుండి 20 నిమిషాలు ఆలస్యంగా నడుస్తున్నాయని అధికారులు తెలిపారు.  భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ముంబైతో పాటు సమీప జిల్లాలైన థానే, రాయ్‌గడ్‌లలో మంగళవారం కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు  కురుస్తాయని అంచనా వేసింది. ముంబై నగరంలోని కొన్ని ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి దృశ్యమానత తగ్గిందని,  వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగిందని వాహనదారులు తెలిపారు. వర్షం కారణంగా పలు రోడ్లు నీట మునిగాయి.

అంధేరి సబ్‌వే, లోఖండ్‌వాలా కాంప్లెక్స్ ప్రాంతాలలో నీరు నిలిచిపోయి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. ముంబై జీవనాధారంగా పరిగణించే సబర్బన్ రైళ్లు నెమ్మదిగా నడుస్తున్నట్లు అధికారులు, ప్రయాణికులు తెలిపారు. శనివారం నుండి నగరంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం ఉదయం 9 గంటల నుండి వర్షాల తీవ్రత మరింత పెరిగిందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement