3, 4 తేదీల్లో వర్షాలు | Heavy rain likely in Andhra Pradesh for next three days | Sakshi
Sakshi News home page

3, 4 తేదీల్లో వర్షాలు

Apr 1 2025 4:25 AM | Updated on Apr 1 2025 4:25 AM

Heavy rain likely in Andhra Pradesh for next three days

సాక్షి, అమరావతి: వేసవిలో అకాల వర్షాలతోపాటు పిడుగులు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ నెల 3న రాయలసీమ, 4న ఉత్తరాంధ్ర జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని పేర్కొంది. మరోవైపు సోమ­వారం రాష్ట్రంలో ఎండల తీవ్రత కొన­సాగింది.

నంద్యాల గోస్పాడులో 40.3 డిగ్రీలు, కర్నూలు జిల్లా కమ్మరచేడులో 40.2, అనంతపురం జిల్లా నాగసముద్రంలో 40 డిగ్రీల ఉష్ణో­గ్రతలు నమోదయ్యాయి. మంగళవారం శ్రీకాకుళం జిల్లాలోని 6 మండలాలు, విజయ­న­గరం జిల్లా–6, పార్వతీపురం మన్యం జిల్లా–10, అల్లూరి సీతారామరాజు జిల్లా–3, తూర్పు గోదావరి జిల్లాలోని కోరుకొండ మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement