pump set
-
రోడ్డు మధ్యలో బోరింగ్ పంపు.. వీడియో వైరల్
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో పీడబ్ల్యూడీ ఇంజనీర్ల నిర్లక్ష్యం కారణంగా వింత ఘటన చోటుచేసుకుంది. రోడ్డు మధ్యలో బోరింగ్ ఉండగానే కొత్త రోడ్డు నిర్మాణం చేపట్టిన అంశం బయటకు రావడంతో అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు తేరుకుని దిద్దుబాటు చర్యలకు దిగారు.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గతేదాడి నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో మీర్జాపూర్ జిల్లాలో పర్యటించేందుకు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ షెడ్యూల్ ఖరారైంది. కాగా, సీఎం యోగి వస్తున్నారని.. అధికారులు ఏర్పాట్లపై ఫోకస్ పెట్టారు. యోగి వస్తున్న కారణంగా మీర్జాపూర్ జిల్లాలో అధికారులు హడావిడి చేశారు. ఇందులో భాగంగానే జిల్లాలోని కాంతిత్ ప్రాంతంలో రోడ్డు వెడల్పు పనులను కూడా యమ స్పీడ్‌గా చేశారు. రోడ్డు పనులు చకచకా కానిచ్చేశారు కానీ.. నడిరోడ్డు మధ్యలో ఉన్న బోరింగ్ పంపును తీసివేయడం మర్చిపోయారు.🚨Mirzapur, UP's new PWD road built AROUND a hand pump. Coordination fail or planning blunder? Who's accountable for this public inconvenience? pic.twitter.com/l1juOKDIsA— indiainlast24hr (@indiain24hr) March 18, 2026బోరింగ్ పంపు నడిరోడ్డుపైన ఉండగానే కొత్త రోడ్డు వేశారు. బోరింగ్ తొలగించకుండానే కొత్త రోడ్డు వేసి కాంట్రాక్టర్, ఇంజనీరింగ్ అధికారులు చేతులు దులుపుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా వైరల్‌గా మారింది. దీంతో, నెటిజన్లు యూపీ ప్రభుత్వం, అధికారులపై మండిపడుతూ కామెంట్స్ చేస్తున్నారు. బోరింగ్ పంపు ఘటన ముఖ్యమంత్రి ఆఫీసుకు కూడా చేరడంతో అధికారులు దిద్దుబాటు చర్యలకు దిగారు. తాజాగా రోడ్డుపై ఉన్న పంపును తొలగించారు. ఈ వీడియో సైతం బయటకు వచ్చింది. ఇప్పుడు ఈ పంపు వ్యవహారం సోషల్ మీడియాలో కొత్త చర్యలకు దారి తీసింది. Handpump In Middle Of The Road, Netizens Slam #PWD #Mirzapur #UttarPradesh #YogiAdityanath pic.twitter.com/VJyrKmY5x9— HW News English (@HWNewsEnglish) March 18, 2026 -
60 రోజులు నీరుతోడే పంపుసెట్లు ఎందుకు?
-
60 రోజులు నీరుతోడే పంపుసెట్లు ఎందుకు?
♦ ‘పాలమూరు’పై అసెంబ్లీలో ప్రశ్నించిన జానారెడ్డి ♦ ఒక టీఎంసీ నీటితో 13వేల ఎకరాలకు నీరెలా ఇస్తారు? సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్‌లో నీటిలభ్యత 30 రోజులు ఉంటే, 60 రోజుల పాటు నీటిని తోడే పంప్సెట్లను ఏర్పాటు చేయడంలో ఆంతర్యం ఏమిటని ప్రతిపక్ష నేత జానారెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శాసనసభలో నీటిపారుదల శాఖ పద్దుపై బుధ వారం ఆయన మాట్లాడుతూ.. నీటి లభ్యత కన్నా ఎక్కువ సామర్థ్యంతో పంప్సెట్ల ఏర్పాటు వల్ల అనవసర సమస్యలు వస్తాయన్నారు. మరోవైపు నీటి లభ్యత మేరకు అనుమతులు ఇస్తామని కేంద్ర జల సంఘం చెబుతుండడాన్ని జానారెడ్డి ప్రస్తావించారు. ప్రాణహిత ద్వారా ఒక టీఎంసీ నీటిని 13,700 ఎకరాలకు ఏ విధంగా సరఫరా చేస్తారు.. అందుకు వినియోగించబోయే టెక్నాలజీని డీపీఆర్‌లో ఎందుకు పేర్కొనలేదు అని ప్రశ్నించారు. కాళేశ్వరం ద్వారా రబీ పంటకు 5లక్షల ఎకరాలకు నాలుగు నెలల పాటు నీరిస్తామంటున్న ప్రభుత్వం, 120 రోజులపాటు పొలాలకు నేరుగా నీరిస్తే రిజర్వా యర్లను ఎప్పుడు నింపుతారో చెప్పాలన్నారు. భూసేకరణతోనే ప్రాజెక్ట్‌లు పూర్తికావు: హరీశ్‌రావు కేవలం భూసేకరణ ప్రక్రియ పూర్తి చేసినంత మాత్రాన ప్రాజెక్ట్‌లు పూర్తి అయినట్లు కాదన్న విషయాన్ని కాంగ్రెస్ నాయకులు గ్రహించాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. భూసేకరణతో పాటు సాంకేతిక, డిజైన్, రైల్వే, అటవీ.. తదితర అనుమతులు కూడా అవసరమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్ట్‌లకు అవసరమైన దాంట్లో అది 50శాతమే సేకరించారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 2013 భూసేకరణ చట్టం మేరకు దేశంలో ఎక్కడా ప్రాజెక్ట్‌లు నిర్మాణం కాలేదన్నారు. రాష్ట్ర అవసరాల మేరకే ప్రాజెక్ట్‌లకు భూమిని సేకరిస్తామని, గతంలో సేకరించి.. ఆయా ప్రాజెక్ట్‌లకు వినియోగించని భూములను తిరిగి రైతులకు ఇచ్చేస్తామని మంత్రి తెలిపారు.


