మైకేల్‌ జాక్సన్‌ని తలపించేలా ఆ తండ్రి డ్యాన్స్‌..! | Desi Dad Moonwalks Into Daughters Reel Goes Viral | Sakshi
Sakshi News home page

మైకేల్ జాక్సన్‌ని తలపించేలా ఆ తండ్రి డ్యాన్స్‌..! నిర్ఘాంతపోయిన కూతురు

Mar 18 2026 4:19 PM | Updated on Mar 18 2026 4:32 PM

Desi Dad Moonwalks Into Daughters Reel Goes Viral

ఓ కూతురు తన తండ్రి ఆ రైంజ్‌లో డ్యాన్స్‌ చేస్తాడని ఊహించలేదు. ఒక్కసారిగి విస్తుపోయి..చివరికి అతడితో కలిసి పాదం కదిపింది. అందుకు సంబంధించిన వీడియో నెటిజన్లను అమితంగా ఆకర్షించడమే కాదు..మేడమ్‌ బహిరంగంగా ప్లే చేస్తే..ఆయన టాలెంట్‌ ఏంటో తెలిసేది కదూ అని కామెంట్‌ చేస్తూ పోస్టుల పెట్టారు కూడా. 

వివరాల్లోకి వెళ్తే..ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన ఈ వీడియలో ఓ యువతి 'బిల్లీ జీన్' పాటకు డ్యాన్స్‌ చేయడంతో ప్రారంభమవుతుంది. ఆమె తండ్రి మాములుగా ఆమె వద్దకు వస్తాడు. ఆ తర్వాత ఆతడు చాలా సులభంగా మూన్‌వాక్‌ చేయడంతో ఒక్కసారిగా ఆ దృశ్యం అనూహ్య మలుపు తీసుకుంటుంది. ఈ నాన్న సాధారణ దుస్తులతో ఉన్నప్పటికీ..చాలా సునాయాసంగా ఆత్మవిశ్వాసంగా చేస్తున్న ఆ డ్యాన్స్‌ ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. 

అత్యంత నేచురల్‌గా కనిపించే ఆ క్షణం మధుర జ్ఞాపకంగా మారిపోయిందా కూతురికి. ఒక్క క్షణం ఆమె సైతం తన తండ్రి అద్భుతమైన డ్యాన్స్‌ చూసి నిశ్చేష్టురాలైపోతుంది. ఆ తర్వాత కొంచెంసేపటికీ అతనితో కలిసి అడుగులు కదపడానికి ప్రయత్నించడంతో వీడియో ముగుస్తుంది. 

కాగా 1982లో విడుదలైన 'బిల్లీ జీన్', మైఖేల్ జాక్సన్  అత్యంత ప్రసిద్ధ ఆల్బమ్‌లలో ఒకటైన 'థ్రిల్లర్'లోని ఒక భాగం. ఈ పాట పాప్ సంగీతం, నృత్య సంస్కృతిలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. అందులోనూ జాక్సన్‌ చేసిన మూన్‌వాక్‌ ప్రపంచవ్యాప్త గుర్తింపుని తెచ్చిపెట్టింది. 

(చదవండి: నటి జ్యోతిక మోడర్న్‌ పేరెంటింగ్‌ టిప్స్‌..!)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement