కడుపునొప్పి భరించలేక ఎస్సై భార్య ఆత్మహత్య | Karimnagar II-Town SI Chandrasekhar Wife Divya Incident | Sakshi
Sakshi News home page

కడుపునొప్పి భరించలేక ఎస్సై భార్య ఆత్మహత్య

Mar 19 2026 7:46 AM | Updated on Mar 19 2026 11:30 AM

Karimnagar II-Town SI Chandrasekhar Wife Divya Incident

కరీంనగర్‌క్రైం: కడుపునొప్పి భరించలేక ఎస్సై భార్య ఆత్మహత్య చేసుకుందని వన్‌టౌన్‌ సీఐ రాంచందర్‌రావు తెలిపారు. ఆయన వివరాల ప్రకారం నగరంలోని హనుమాన్‌నగర్‌లో నివాసం ఉంటూ టూటౌన్‌ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న దేశ్‌ చంద్రశేఖర్‌ భార్య దివ్య(30) కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతోంది. బాధ భరించలేక మంగళవారం మధ్యాహ్నం గన్నేరుపువ్వుల రసం తాగింది. ఈ విషయం పోలీసుస్టేషన్‌కు వెళ్లిన చంద్రశేఖర్‌కు ఫోన్‌చేసి చెప్పడంతో వెంటనే నగరంలోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌ తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతిచెందింది. దివ్య తండ్రి తెడ్ల చిన్నసమ్మయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు 

Advertisement
 
Advertisement
Advertisement