సల్మాన్ ఖాన్ ఈ మధ్య తరుచుగా వార్తల్లో నిలుస్తున్నాడు. 'బ్యాటల్ ఆఫ్ గాల్వాన్' పేరుతో తీస్తున్న ఓ సినిమాలో హీరోగా చేస్తున్నాడు. కొన్నిరోజుల క్రితమే గ్లింప్స్ రిలీజ్ చేశారు. అంతలోనే దీనిపై చైనా అక్కసు వెళ్లగక్కింది. ఈ సంగతి పక్కనబెడితే ఇప్పుడు ఆసక్తికర పనిచేసి చర్చనీయాంశమయ్యాడు. తన సవతి చెల్లిపై అంతులేని ప్రేమ చూపించడమే ఇందుకు కారణం. ఇంతకీ ఏంటి సంగతి?
(ఇదీ చదవండి: సింగర్‌తో యంగ్ బాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. అధికారిక ప్రకటన)
సల్మాన్ ఖాన్‌కి ముంబైలో ఇల్లు ఉన్నప్పటికీ.. పాన్వెల్ అనే ప్రాంతంలో 150 ఎకరాల విస్తీర్ణంలో ఉండే ఫామ్ హౌస్‌లోనే ఎక్కువగా ఉంటుంటాడు. కొన్నిరోజుల క్రితం పుట్టినరోజు వేడుకల్ని కూడా అక్కడే సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ ఫౌమ్ హౌస్‌కే తన సవతి చెల్లి అర్పితా పేరుని పెట్టాడు. ఇదే ఇప్పుడు ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఎందుకంటే సల్మాన్ ఖాన్‌కి ఇద్దరు సోదరులు, ఓ సోదరి ఉన్నప్పటికీ.. తెచ్చి పెంచుకున్న అర్పితాపై ఎక్కువ మమకారం చూపిస్తుంటాడు.
చిన్నప్పటి నుంచి అర్పితాని పెంచి పెద్ద చేసి పెళ్లి చేయడంలో సల్మాన్ కీలక పాత్ర పోషించాడు. ఆమె కొడుకుల్ని కూడా ముద్దు చేస్తుంటాడు. ఇప్పుడు ఈమె పేరుని తన ఫౌమ్ హౌస్‌కి పెట్టాడంటే రాబోయే రోజుల్లో ఈ ఆస్తిని ఆమెకు రాసిచ్చిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. 150 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఫౌమ్ హౌస్ ప్రస్తుత విలువ రూ.80 కోట్ల పైనే ఉండొచ్చని టాక్.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన మలయాళ థ్రిల్లర్.. తెలుగు రివ్యూ)


