హీరోయిన్ బిపాసా బసు- నటుడు కరణ్ సింగ్ గ్రోవర్ దంపతులు కూతురు దేవిని తీసుకుని బయటకు వెళ్లారు. సెలబ్రిటీలు ఎక్కడుంటే అక్కడ క్షణాల్లో ప్రత్యక్షమయ్యే పాపరాజీ(ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు) బిపాసా దంపతులను ఫాలో అయ్యారు. హీరోయిన్‌ను, ఆమె కూతురు దేవిని ఫోటోలు తీశారు. దీంతో బిపాసా కాస్త అసహనానికి లోనైంది. వెంటనే కూతురు ముఖాన్ని దాచేసింది. అసలు ఎవరు మీరంతా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. అలా కోపంతోనే ఓ బిల్డింగ్‌లోకి నడుచుకుంటూ వెళ్లిపోయింది.
చిగురించిన లవ్ స్టోరీ
2015లో వచ్చిన ఎలోన్ సినిమా షూటింగ్‌లో కరణ్ సింగ్- బిపాసా కలుసుకున్నారు. వెండితెరపై జంటగా కనిపించిన ఈ జోడీ రియల్ లైఫ్‌లోనూ ప్రేమలో పడింది. ఏడాదిపాటు ప్రేమకబుర్లు చెప్పుకున్న వీరు 2016 ఏప్రిల్‌లో పెళ్లి చేసుకున్నారు. వీరి దాంపత్యానికి గుర్తుగా 2022లో కూతురు దేవి జన్మించింది.
సినిమా
సినిమాల విషయానికి వస్తే.. తెలుగులో టక్కరిదంగ సినిమాలో నటించింది. బాలీవుడ్‌లో ఒకప్పుడు టాప్ హీరోయిన్‌గా రాణించిన బిపాసా కొంతకాలంగా మూవీస్‌కు దూరంగా ఉంటోంది. చివరగా డేంజరస్ వెబ్ సిరీస్‌లో నటించింది. ఇందులో ఆమె భర్త కరణ్ సింగ్ కూడా నటించాడు. ఇతడు చివరగా ఫైటర్ మూవీలో యాక్ట్ చేశాడు.
చదవండి: ఓటీటీలో మోగ్లీ మూవీ.. ఎక్కడంటే?


