సినిమా ఇండస్ట్రీ అంటే చాలామందిలో చెడు అభిప్రాయం ఉంది. అందుకే ఈ ఇండస్ట్రీలోకి వెళ్తామనగానే పేరెంట్స్ అంత ఈజీగా అస్సలు ఒప్పుకోరు. మరీ ముఖ్యంగా అమ్మాయిల్ని అసలే అనుమతించరు. తన ఇంట్లో అయితే అమ్మ చచ్చిపోతానని బెదిరించిందంటోంది బాలీవుడ్ నటి సయాని గుప్తా.
మంచి జీతం
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నా చదువైపోగా ఓ ఉద్యోగం సంపాదించాను. మంచి సంపాదన.. సీజన్‌లో కనిపించింది. బాగానే డబ్బులు వచ్చేవి. ఏడాదిన్నరపాటు జాబ్ చేశాను, కానీ అది నాకు సంతృప్తినివ్వలేదు. యాక్టింగ్ ఫీల్డ్‌లోకి రావాలన్నది నా కల. అమ్మ అస్సలు ఒప్పుకోలేదు. చేతి మణికట్టు కోసుకుని చస్తానని బెదిరించింది. తను యాక్టర్స్‌ను వేశ్యలు అని పిలిచేది.
అమ్మ సపోర్ట్ లేదు
నేను కూడా నటిగా మారతానన్న ఆలోచన తట్టుకోలేకపోయింది. చిన్నప్పటినుంచి నేను ఎక్కడా ఎలాంటి రిహార్సల్స్ చేయకుండా ఇంట్లోనే బంధించేది. యాక్టర్స్ అందరూ వేశ్యలూ.. అటువైపే వెళ్లొద్దు అనేది. నాన్న మాత్రం నేనేం చేసినా సపోర్ట్ చేసేవాడు. అలా ఆయన అంగీకారంతో ఎఫ్‌టీఐఐ (ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా)లో చేరాను.
సినిమా
అప్పుడు నెలరోజులపాటు అమ్మ నాతో మాట్లాడటమే మానేసింది. ఆ తర్వాత ఓసారి క్యాంపస్‌కు వచ్చాక తన ఆలోచనా విధానం మారిపోయింది. సయానీ గుప్తా.. జాలీ ఎల్‌ఎల్‌బీ 2, ఆక్సన్, పాగలైట్, ఆర్టికల్ 15, జ్విగాటో వంటి పలు చిత్రాల్లో నటించింది. చివరగా ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ వెబ్ సిరీస్ నాలుగో సీజన్‌లో కనిపించింది.
చదవండి: పదో సినిమా ఫిక్స్.. టైటిల్ విచిత్రంగా ఉంటుంది: అనిల్ రావిపూడి


