హీరో ఎప్పటికీ హీరోనే.. ఎంత వయసొచ్చినా సరే వాళ్లు ఎవర్‌గ్రీన్ స్టార్స్‌గానే కొనసాగుతారు. అలాంటి హీరోను పట్టుకుని ఓ నటి అంకుల్ అనేసిందంటూ కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇంతకీ అన్నది ఎవరినో కాదు, లక్షలాది మంది మనసుల్ని దోచుకున్న కింగ్ షారూఖ్ ఖాన్‌ను! అసలు ఎవరా నటి? ఏంటీ కథ ఓసారి చూసేద్దాం..
అక్కడ మొదలైంది
సౌదీ అరేబియాలోని రియాద్‌లో ఇటీవలే జాయ్ అవార్డుల ఫంక్షన్ జరిగింది. ఈ కార్యక్రమానికి కేటీ పెరీ, మిల్లీ బాబీ బ్రౌన్ వంటి పలువురు హాలీవుడ్ స్టార్స్ హాజరయ్యారు. బాలీవుడ్ నుంచి షారూఖ్ ఖాన్ కూడా వెళ్లాడు. అలాగే టర్కిష్ నటి హండె ఎర్సెల్ కూడా ఆ వేడుకలో పాల్గొంది. ఆమె స్నేహితురాలు, నటి అమీనా ఖలీల్.. షారూఖ్‌తో కలిసి అవార్డులు ప్రదానం చేసింది. దాన్ని హండె తన ఫోన్‌లో వీడియో తీసింది. దాంతో హండె కూడా షారూఖ్ ఖాన్‌కు పెద్ద అభిమాని అంటూ సోషల్ మీడియాలో ప్రచారం తీశారు.
ఎవరీ అంకుల్?
ఇంతలోనే నెట్టింట మరో పోస్ట్ ప్రత్యక్షమైంది. అందులో ఏముందంటే.. హండే తన స్నేహితురాలిని మాత్రమే వీడియో తీశానని రాసుంది. షారూఖ్‌ను చూపిస్తూ ఎవరీ అంకుల్ అని రాసుకొచ్చింది. అతడికి తాను అభిమానిని కాదని, దయచేసి ఈ ప్రచారాన్ని ఇంతటితో ఆపేయమని కోరినట్లుగా ఓ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ స్క్రీన్‌షాట్ తెగ వైరలయింది.
అది ఫేక్
దీంతో నెటిజన్లు కన్‌ఫ్యూజన్‌లో పడ్డారు. ఇంతకీ హండె షారూఖ్ అభిమానియేనా? అయినా అంత పెద్ద హీరోను పట్టుకుని అంకుల్ ఎలా అనేసింది? అని విమర్శించారు. ఈ క్రమంలో ఎట్టకేలకు ఈ వివాదంపై స్పందించింది హండె. వైరలవుతున్న స్క్రీన్‌షాట్ ఫేక్ అని క్లారిటీ ఇచ్చింది. దీంతో ఆమె షారూఖ్ అభిమానా? కాదా? అన్నది పక్కనపెడితే ఆయన్ను అంకుల్ అనైతే అనలేదు అని ఫ్యాన్స్ సంతోషపడుతున్నారు.
సినిమా
సినిమాల విషయానికి వస్తే.. షారూఖ్ ఖాన్ ప్రస్తుతం కింగ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తోంది. కాగా హండె ఎర్సెల్.. ఇంటాక్సికేటెడ్ బై లవ్, చేజింగ్ ద విండ్ అని రెండు టర్కిష్ సినిమాలు చేసింది. వెండితెరపైకి రావడానికి ముందు బుల్లితెరపై ఎక్కువగా సీరియల్స్ చేసింది. అవకాశామొస్తే బాలీవుడ్‌లోనూ యాక్ట్ చేస్తానంది.

ఫేక్ స్క్రీన్‌షాట్ (ఫోటోలో ఎడమవైపు)
చదవండి: వాళ్లంతా వేశ్యలూ.. నువ్వూ అదే అవుతానంటే ఎలా?: నటిపై అమ్మ ఫైర్


