ఇంట్లో అందరూ హీరోయిన్సే.. ఈ బ్యూటీని గుర్తుపట్టారా? | Riya Sen 45th Birthday: Know About Actress Movies | Sakshi
Sakshi News home page

అటు హీరోయిన్‌గా.. ఇటు ఐటం సాంగ్స్‌.. తెలుగులోనూ ఓ మూవీ!

Jan 24 2026 7:30 PM | Updated on Jan 24 2026 7:51 PM

Riya Sen 45th Birthday: Know About Actress Movies

పై ఫోటోలో కనిపిస్తున్న బ్యూటీ బాలీవుడ్‌ హీరోయిన్‌. తెలుగులోనూ ఒక సినిమా చేసింది. ఈమె అక్క, తల్లి, అమ్మమ్మ అందరూ హీరోయిన్సే కావడం విశేషం. ఇంతకీ ఈ హీరోయిన్‌ ఎవరో గుర్తుపట్టారా? తనే రియా సేన్‌. ఈరోజు ఆమె 45వ పుట్టినరోజు(జనవరి 24). ఈ సందర్భంగా తన కెరీర్‌ను ఓసారి చూసేద్దాం.

ఫ్యామిలీ మొత్తం..
రియా సేన్‌ది బెంగాలీ కుటుంబం. ఆమె తల్లి మూన్‌మూన్‌ సేన్‌, అమ్మమ్మ సుచిత్రా సేన్‌ ఇద్దరూ పేరున్న నటీమణులే. ఆ రక్తమే తనలో, తన అక్క రైమా సేన్‌లో ప్రవహించింది. ఇద్దరూ సినిమా ఇండస్ట్రీనే ఎంచుకున్నారు. హీరోయిన్స్‌గా రాణించారు. రియా సేన్‌ ఐదేళ్ల వయసులోనే తన తల్లి సినిమాలో కూతురిగా యాక్ట్‌ చేసింది. 

అక్కాచెల్లెళ్లకు అచ్చిరాని టాలీవుడ్‌
టీనేజ్‌కు రాగానే తాజ్‌మహల్‌ అనే తమిళ చిత్రంతో హీరోయిన్‌గా మారింది. తమిళంలోనే కాకుండా హిందీ, బెంగాలీ, మలయాళ, ఇంగ్లీష్‌, ఒడియా భాషల్లోనూ సినిమాలు చేసింది. తెలుగులో ఆమె నటించిన ఏకైక మూవీ 'నేను మీకు తెలుసా?'. ఈ సినిమా ఫ్లాప్‌ అయ్యేసరికి ఇక్కడ అవకాశాలే రాలేదు. దాంతో టాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పి బాలీవుడ్‌లోనే సెటిలైంది. ఈమె అక్క రైమా సేన్‌ కూడా తెలుగులో ధైర్యం అని ఒకే ఒక్క సినిమా చేయడం గమనార్హం!

సినిమా, పెళ్లి
రియా బాలీవుడ్‌లో స్టైల్‌, ఝంకార్‌ బీట్స్‌, ఖయామత్‌, అప్న సప్న మనీ మనీ, లవ్‌ కిచిడీ.. ఇలా అనేక సినిమాలు చేసింది. మధ్యలో ఐటం సాంగ్స్‌లోనూ తళుక్కుమని మెరిసింది. ఓటీటీలో రాగిని ఎమ్‌ఎమ్‌ఎస్‌: రిటర్న్స్‌, పాయిజన్‌, మిస్‌మ్యాచ్‌ 2, కాల్‌ మీ బే వెబ్‌ సిరీస్‌లలో కనిపించింది. 2017లో వ్యాపారవేత్త శివం తివారిని రియా సేన్‌ సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందంటూ కొన్ని ఫోటోలు సోషల్‌ మీడియాలో లీకయ్యాయి. అయితే ఆ తర్వాత మాత్రం తన పెళ్లి గురించి రియా ఎప్పుడూ ఓపెన్‌ అవలేదు.

 

 

చదవండి: స్టార్‌ హీరోకు తల్లిగా అడిగారు.. అయిష్టంగానే చేశా: మీనా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement