అల్లుడు కేఎల్ రాహుల్‌పై మామయ్య సునీల్ శెట్టి ప్రశంసలు కురిపించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో సెంచరీ కొట్టడంతో బాలీవుడ్ నటుడు కొనియాడారు. విభిన్నమైన స్థానం.. అదే ప్రశాంతత.. అదే వ్యక్తిత్వం అంటూ అల్లుడిని ఆకాశానికెత్తేశారు. ఆ స్కోర్ బోర్డ్‌లో ఈ సెంచరీ ప్రత్యేకంగా గుర్తుంటుందని అన్నారు. దీని వెనుక ఉన్న క్షణాలను సంయమనాన్ని నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటానని సునీల్ శెట్టి పోస్ట్ చేశారు. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉందంటూ ఇన్‌స్టాలో ఓ వీడియోను షేర్ చేశారు. ఇది చూసిన కేఎల్ ఫ్యాన్స్ సైతం శుభాకాంక్షలు చెబుతున్నారు.
కాగా.. కేఎల్ రాహుల్.. సునీల్ శెట్టి కుమార్తె అతియా శెట్టిని పెళ్లాడిన సంగతి తెలిసిందే. వీరిద్దరికీ ఓ కుతూరు కూడా జన్మించింది. వీరి పెళ్లి వేడుకను సునీల్ తన ఫామ్ హౌస్‌లోనే గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ పెళ్లి బాలీవుడ్ సినీ ప్రముఖులు, పలువురు క్రికెటర్లు సందడి చేశారు. కాగా.. కేఎల్ సతీమణి అతియా శెట్టి కేవలం మూడు సినిమాల్లో మాత్రమే నటించింది.


