'తుంబాడ్' సినిమాతో దర్శకుడు రాహి అనిల్ బార్వే దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. సుమారు ఏడేళ్ల తర్వాత ఆయన డైరెక్ట్ చేసిన మరో సినిమా మయసభ.. సరికొత్త కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 30న విడుదల కానుంది. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో జావేద్ జాఫేరీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వీణా జామ్కర్, దీపక్ దామ్లే, మహమ్మద్ సమద్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఓ దర్శకుడి జీవితం ఆధారంగా ఈ మూవీని తీసినట్లు చిత్ర వర్గాలు తెలిపాయి.
భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన 'మయసభ: ది హాల్ ఆఫ్ ఇల్యూజన్’ (Mayasabha: The Hall Of Illusion)' చిత్రాన్ని పికల్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ సమర్పిస్తుండగా.. జిర్కాన్ ఫిల్మ్స్ పీ లిమిటెడ్ నిర్మిస్తోంది. తెలుగులో కూడా ఈ చిత్రం విడుదల కానుంది. బంగారం కోసం వేట.. అందులో దాగిన రహస్యంతో పాటు భ్రమలతో కూడిన ఓ కొత్త ప్రపంచాన్ని ఇందులో చూపించనున్నారు. ఒక థియేటర్‌లో టన్నుల కొద్ది బంగారం దాచి మరిచిపోయారనే ఆసక్తికర డైలాగ్స్ మెప్పించేలా ఉన్నాయి.


