భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బయోపిక్‌గా వస్తోన్న చిత్రం "మా వందే". ఈ చిత్రంలో నరేంద్ర మోదీ పాత్రలో మలయాళ స్టార్ హీరో ఉన్ని ముకుందన్ నటిస్తున్నారు. ఇందులో రవీనా టాండన్, జగపతి బాబు, శరత్ కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సిల్వర్ కాస్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ మూవీని నిర్మిస్తున్నారు. దాదాపు రూ.400 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
ఎన్నో పోరాటాల కన్నా తల్లి సంకల్పం గొప్పదనే సందేశాన్నిస్తూ ప్రధాని మోదీ జీవితాన్ని యదార్థ ఘటనల ఆధారంగా దర్శకుడు క్రాంతికుమార్ సీహెచ్ రూపొందిస్తున్నారు. ప్రధాని మోదీ వ్యక్తిగత, రాజకీయ జీవితంలోని విశేషాలన్నీ "మా వందే రూపంలో ప్రేక్షకులను చూపించనున్నారు. ఈ సినిమా అంతర్జాతీయ ప్రమాణాలతో.. అత్యున్నత సాంకేతిక విలువలు, వీఎఫ్ఎక్స్‌తో రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా భాషలతో పాటు ఇంగ్లీష్‌లోనూ రిలీజ్ చేయనున్నారు.
ఈ మూవీని ప్రపంచంలో తొలిసారిగా ఆరి అలెక్సా 265 జెంట్రీ, కుకీ లెన్స్‌తో తెరకెక్కిస్తుండటం విశేషం. హాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ ఆక్వామ్యాన్‌లో హీరోగా నటించిన జేసన్ మమొవాను "మా వందే" చిత్రంలో ఓ కీలక పాత్రకు సంప్రదిస్తున్నారు. స్టంట్ కొరియోగ్రాఫర్ కింగ్ సోలొమన్ , ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్, డీవోపీ కె.కె. సెంథిల్ కుమార్, మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రుర్ వంటి టాప్ మోస్ట్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారు. ఓ మామూలు బయోపిక్‌లా కాకుండా సినీ చరిత్రలో చిరకాలం నిలిచిపోయే అత్యంత భారీ ప్రాజెక్ట్‌గా నిర్మిస్తున్నారు. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ 22వ తేదీ నుంచి కశ్మీర్‌లో ప్రారంభం కానుంది.


