యాక్టర్స్ సినిమాలు, సీరియల్స్, యాడ్స్, షోలతో పాటు బయట ఈవెంట్స్ కూడా చేస్తుంటారు. నటి మౌనీ రాయ్ కూడా అలాంటి ప్రోగ్రామ్స్‌కు తరచూ వెళ్తుంటుంది. ఈ క్రమంలోనే ఇటీవల హర్యానాలోని కర్నాల్‌లో జరిగిన ఓ ఫ్యామిలీ ఈవెంట్‌కు హాజరైంది. అయితే ఆ కార్యక్రమం తనకు చేదు అనుభవాన్ని మిగిల్చిందంటోంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
నడుముపై చేయి వేసిన అంకుల్స్
'కర్నాల్‌లో ఓ ఈవెంట్‌కు వెళ్లాను. అక్కడ ఇద్దరు అంకుల్స్ చాలా చెత్తగా ప్రవర్తించారు. వాళ్లకు తాత వయసుంటుంది. నేను స్టేజీపైకి వెళ్తుంటే ఆ అంకుల్స్‌తో పాటు వారి కుటుంబంలోని మగవారు నాతో ఫోటోలు దిగేందుకు ముందుకు వచ్చారు. నా నడుముపై చేయి వేసి ఫోటోలు దిగారు. సర్, చేయి తీసేయండి అని వినయంగా చెప్పినా వెగటుగా ప్రవర్తించారు. స్టేజీ ఎక్కాక పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది.
పరిస్థితి మరింత ఘోరం
ఎదురుగా ఉన్న ఇద్దరు అంకుల్స్ చెండాలమైన కామెంట్స్ చేస్తూ అసభ్య సంజ్ఞలు చూపించారు. దయచేసి అలా చేయొద్దు అని చెప్పగానే నాపై గులాబీలు విసరడం మొదలుపెట్టారు. అప్పుడు నేను డ్యాన్స్ మధ్యలోనే ఆపేసి స్టేజీ దిగి వచ్చేయాలనుకున్నాను. కానీ కోపాన్ని ఆపుకుని నా పర్ఫామెన్స్ పూర్తి చేశాను. ఆ తర్వాత కూడా వాళ్లు అలాగే నీచంగా ప్రవర్తించారు. ఇంత జరుగుతున్నా ఆ ఫంక్షన్ నిర్వాహకులు, కుటుంబసభ్యులు ఎవరూ ముందుకు వచ్చి వాళ్లను వారించలేదు. కనీసం పక్కకు కూడా తీసుకెళ్లలేదు.
తలుచుకుంటనే భయంగా
అవమానంతో చచ్చిపోయా.. మానసిక క్షోభకు లోనయ్యాను. నా పరిస్థితే ఇలా ఉంటే ఈ ఇండస్ట్రీకి కొత్తగా వచ్చే అమ్మాయిల గురించి తలుచుకుంటనే భయంగా ఉంది. ఇలా నీచంగా ప్రవర్తించేవారిపై అధికారులు చర్యలు తీసుకోవాలి. మాకు వచ్చిన కళను నమ్ముకుని మేము బతుకుతున్నాం. వీళ్ల కూతురితోనో, అక్కాచెల్లితోనే వేరేవాళ్లు ఇలాగే ప్రవర్తిస్తే ఊరుకుంటారా?
మగవాళ్లమన్న అహంకారమా?
కొంచెమైనా సిగ్గుండాలి! ఇంకో విషయం.. స్టేజీ కాస్త హైట్‌లో ఉంది. దాంతో ఈ అంకుల్స్.. లో యాంగిల్‌లో వీడియోలు తీశారు. కొందరు అది చూసి వీడియోలు షూట్ చేయడం ఆపమని చెప్పినందుకు వారిపైనే అరిచారు. ఎందుకంత ధైర్యం? మగవాళ్లమన్న అహంకారమా? ఇలాంటివారిని తిట్టేందుకు తిట్లు కూడా రావడం లేదు. పెళ్లికొడుకు, పెళ్లికూతుర్ని దీవించేందుకు ఈ ప్రోగ్రామ్స్‌కు పిలుస్తారు, రివర్స్‌లో మాకు జరిగేది ఇలాంటి వేధింపులు, అవమానం!' అని మౌనీరాయ్ ఆవేదన వ్యక్తం చేసిందిద.
సీరియల్స్, సినిమాలు
మౌనీరాయ్.. క్యూంకీ సాస్‌భీ కబీ బహుతీ సీరియల్ ద్వారా బుల్లితెరకు పరిచయమైంది. పలు సీరియల్స్‌లో యాక్ట్ చేసిన ఈ బ్యూటీ.. జర నచ్‌కే దిఖా 1 సీజన్ విన్నర్‌గా నిలిచింది. నాగిని సీరియల్‌తో ఫుల్ ఫేమస్ అయింది. గోల్డ్, మేడ్ ఇన్ చైనా, బ్రహ్మాస్త్ర, ద భూతిని సినిమాల్లో నటించింది. కేజీఎఫ్ 1లో స్పెషల్ సాంగ్‌లో మెరిసింది. ప్రస్తుతం తెలుగులో విశ్వంభర సినిమాలో యాక్ట్ చేస్తోంది.
చదవండి: చెట్ల మందులు వాడా.. చాలా గలీజ్‌గా ఫీలయ్యా: శివజ్యోతి


