కింగ్ షారూఖ్ ఖాన్ కూతురు సుహానా 'ద ఆర్చీస్' మూవీతో సినీప్రయాణాన్ని ప్రారంభించింది. ఇప్పుడేకంగా తండ్రితో కలిసి నటించబోతోంది. షారూఖ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న కింగ్ చిత్రంలో సుహానా కీలక పాత్ర పోషిస్తోంది. అయితే చిన్నప్పుడు యాక్టింగ్ అంటే ఆసక్తే ఉండేది కాదని, రానురానూ తన ఆలోచన మారిందని చెప్తోంది.
ఒంటరిగా ఏడ్చా..
తాజాగా ఓ ఇంటర్వ్యూలో సుహానా మాట్లాడుతూ.. చిన్నప్పుడు స్కూల్‌లో నాటకాల్లో పాల్గొనాలంటే అస్సలు ఇంట్రస్ట్ ఉండేది కాదు. కానీ, తర్వాత సడన్‌గా నాకు దానిపై ఆసక్తి పెరిగింది. ఓసారి స్కూల్‌లో వేయబోయే ఒక నాటకం కోసం ఆడిషన్ ఇచ్చాను, కానీ నేను కోరుకున్న పాత్రలో నన్ను సెలక్ట్ చేయలేదు. ప్రాధాన్యత లేని పాత్ర ఇచ్చారు. చాలా బాధపడ్డాను. గదిలో ఒంటరిగా కూర్చుని ఏడ్చాను.
కింగ్ సినిమాలో..
అప్పుడు నాకు యాక్టింగ్‌పై ఎంత ఇష్టం ఉందనేది తెలిసింది. స్టేజీపై పర్ఫామ్ చేస్తుంటే ఆ కిక్కే వేరు. ఆ ప్యాషన్ ఇప్పటికీ నన్ను ముందుకు నడిపిస్తోంది అని చెప్పుకొచ్చింది. కింగ్ సినిమా విషయానికి వస్తే.. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తుండగా షారూఖ్ కూతురు సుహానా కీలక పాత్ర పోషిస్తోంది. దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తోంది. 'కింగ్' షారూఖ్‌తో దీపికా నటిస్తున్న ఆరో సినిమా కావడం విశేషం! గతంలో వీరిద్దరూ ఓం శాంతి ఓం, చెన్నై ఎక్స్‌ప్రెస్, హ్యాపీ న్యూ ఇయర్, పఠాన్, జవాన్ సినిమాల్లో కలిసి నటించారు.
చదవండి: 37 ఏళ్ల తర్వాత మొదటి హీరోను కలిసిన స్టార్ హీరోయిన్


