ఆ పాటలు పాడినందుకు పైసా ఇవ్వలేదు: సింగర్‌ | Bollywood singer Says He was Paid 0 for This Songs | Sakshi
Sakshi News home page

నాకు పైసా ఇవ్వలేదు.. అడిగితే ఛాన్సులివ్వరు.. వాళ్లకేమో కోట్లు..

Jan 24 2026 4:59 PM | Updated on Jan 24 2026 4:59 PM

Bollywood singer Says He was Paid 0 for This Songs

యాక్టర్సే కాదు సింగర్స్‌ కూడా లక్షల్లో ఏకంగా కోట్లల్లో సంపాదిస్తున్నారు. అయితే అందరి పరిస్థితి అలా లేదంటున్నాడు బాలీవుడ్‌ సింగర్‌ కృష్ణ బ్యూరా. ఇతడు చక్‌దే ఇండియాలో మౌలా మేరే లేలే మేరీ జాన్‌, ఆషిక్‌ బనాయా ఆప్నేలో ఆప్‌కీ కాశిశ్‌ వంటి పలు సాంగ్స్‌ ఆలపించాడు. తనకు సరైన పారితోషికం ఇవ్వలేదని చెప్తున్నాడు.

సరైన పారితోషికం లేదు
తాజాగా ఓ ఇంటర్వ్యూలో సింగర్‌ కృష్ణ మాట్లాడుతూ.. బాలీవుడ్‌లో సింగర్స్‌ కోసం ఎటువంటి విధివిధానాలు లేవు. ఆర్టిస్ట్‌కు ఒకరోజుకు ఇంత అని ఎలా ఇస్తారో.. సింగర్‌ను స్టూడియోకు పిలిపించినప్పుడు కనీసం రూ.10 వేలయినా ఇవ్వాలి. కానీ ఇవ్వరు. ఆప్‌ కీ కాశిశ్‌ పాటకు నాకు రూ.10 వేలిచ్చారు. అందులో రూ.900 టీడీఎస్‌ కట్‌ అయింది. చక్‌దే ఇండియాలో ఒక పాట పాడినందుకు మళ్లీ అంతే ఇచ్చారు.

పైసా రాలే
రాజ్‌ మూవీలోని సోనియా ఓ సోనియా పాటకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. మోకో కహా దుండెరే బండె, మేరా ఇంతకం దేకేగి పాటలకు పైసా పారితోషికం ఇవ్వలేదు. నా 23 ఏళ్ల కెరీర్‌లో సినిమా పాటలు పాడి పెద్దగా సంపాదించిందే లేదు. మేము బయట షోలు, కచేరీల ద్వారా బాగా సంపాదిస్తామని ఇక్కడ నిర్మాతలు అనుకుంటారు. 

డిమాండ్‌ ఉంటేనే
పోనీ, మొమహమాటం పక్కనపెట్టి డబ్బు అడిగామనుకో.. నెక్స్ట్‌ టైం నీకు పాడే ఛాన్స్‌ ఇవ్వరు. ప్రస్తుతానికైతే పరిస్థితి కొంత మారినట్లు కనిపిస్తోంది. కొందరు పాటకు రూ.5 లక్షలు, రూ.10 లక్షలు తీసుకుంటారు. ఒక్క సాంగ్‌కు రూ.50 లక్షలు, రూ.3 కోట్ల వరకు తీసుకునేవాళ్లు కూడా ఉన్నారు. సింగర్స్‌కు డిమాండ్‌ ఉంటేనే వారు అడిగినంత ఇస్తారు అని చెప్పుకొచ్చాడు.

చదవండి: పెళ్లికి పిలిచి అవమానించాలా? అసభ్యంగా ఫోటోలు, వీడియోలు: నటి ఆగ్రహం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement