గతేడాది తిరుగులేని కథానాయికగా పేరు తెచ్చుకుంది రష్మిక మందన్నా. ఛావా, కుబేర, థామా, ది గర్ల్‌ఫ్రెండ్ సినిమాలతో సూపర్ హిట్లు, బ్లాక్‌బస్టర్లు అందుకుంది. 2025లో ఆమె నటించిన అన్ని సినిమాలు విజయాలు సాధిస్తే.. ఒకే ఒక మూవీ మాత్రం బాక్సాఫీస్ వద డిజాస్టర్‌గా నిలిచింది. అదే సికందర్. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా నటించాడు.
గతేడాది ఒక్కటే ఫ్లాప్
తమిళ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించాడు. గతేడాది మార్చిలో విడుదలైన ఈ చిత్రం బడ్జెట్ కూడా రాబట్టలేకపోయింది. హీరో సమయానికి సెట్‌కు వచ్చేవాడు కాని, అందుకే సినిమా పోయింని మురుగాస్ సల్మాన్‌ను విమర్శించాడు. దాంతో ఆ హీరో కూడా దర్శకుడికి రివర్స్ కౌంటర్లిచ్చాడు. తాజాగా సికందర్ మూవీ గురించి రష్మిక స్పందించింది.
నాకు చెప్పిన కథ వేరు
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. సికందర్ కథ నాకు చెప్పినప్పుడు ఒకలా ఉంది. తర్వాత మొత్తం మారిపోయింది. సాధారణంగా ఇది సినిమాల్లో జరుగుతూనే ఉంటుంది. మొదట కథ ఒకటి చెప్తారు.. సినిమా తీసే క్రమంలో.. పర్ఫామెన్స్, రిలీజ్ డేట్, ఎడిటింగ్.. వీటన్నింటి మూలంగా అన్నీ మారిపోతూ ఉంటాయి. సికందర్ విషయంలో కూడా అదే జరిగింది అని చెప్పుకొచ్చింది.
చదవండి: ఆ ఇద్దరే బిగ్‌బాస్ విజేతలు.. మరో సర్‌ప్రైజ్ ఏంటంటే?


