గత కొన్నిరోజుల నుంచి హీరోయిన్ మృణాల్ ఠాకుర్ తెగ ట్రెండ్ అయిపోయింది. తమిళ హీరో ధనుష్‌ని వాలంటైన్స్ డే నాడు పెళ్లి చేసుకోనుందనే పుకార్లే దీనికి కారణం. ఒకటి రెండు రోజుల పాటు అందరూ ఈ వార్త నిజమేనని అనుకున్నారు. ఇదంతా ఫేక్ అని మృణాల్ టీమ్ ఇదంతా ఫేక్ అని చెప్పడంతో అందరికీ ఓ క్లారిటీ అయితే వచ్చింది. ఇదలా ఉండగానే ఓ రొమాంటిక్ మూవీని మృణాల్ రెడీ చేసింది.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 28 సినిమాలు)
'దో దివానే షెహర్ మైన్' పేరుతో తీసిన ఈ రొమాంటిక్ సినిమాలో మృణాల్ సరసన సిద్ధాంత్ చతుర్వేది నటించాడు. ఫిబ్రవరి 20న థియేటర్లలో మూవీ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఇప్పుడు టీజర్ విడుదల చేశారు. సిద్ధాంత్-మృణాల్ కెమిస్ట్రీ బాగానే వర్కౌట్ అయినట్లు కనిపిస్తుంది. మరి ఈ చిత్రంతోనైనా హిట్ అందుకుంటుందేమో చూడాలి? ఎందుకంటే ఈమె గత రెండు చిత్రాలు.. సన్నాఫ్ సర్దార్ 2, ద ఫ్యామిలీ స్టార్.. బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా ఫెయిలయ్యాయి. చూడాలి మరి ఈసారి ఏం చేస్తుందో?
(ఇదీ చదవండి: క్యారవాన్‌లో అసభ్య ప్రవర్తన.. హీరో చెంప పగలగొట్టా: పూజా హెగ్డే)


