madhuri Dixit
-
ముద్దు సీన్ కోసం అదనంగా కోటి చెల్లించిన హీరో
ఈ కాలం సినిమాల్లో రొమాంటిక్ సీన్లు చాలా కామన్.. అదే 40 ఏళ్ల క్రితం అలాంటి సీన్లు థియేటర్స్‌లో రన్ అయితే పెద్ద చర్చనీయాంశం అని చెప్పవచ్చు. 1988లో బాలీవుడ్లో విడుదలైన 'దయావన్' సినిమా పెద్ద సన్సేషన్ అని చెప్పవచ్చు. ఆ కాలం నాటి సినిమాలను ఫాలో అయ్యే వారికి దాని ప్రభావం ఏంటో బాగా తెలుసు. వినోద్ ఖన్నా, మాధురీ దీక్షిత్ నటించిన 'దయావన్' మూవీ విడుదలైన సమయంలో ఎన్నో సంచలనాలను క్రియేట్ చేసింది. ఈ సినిమాలో వారిద్దరి మధ్య తెరకెక్కించిన మోస్ట్ రొమాంటిక్ సీన్ ఉండటంతో అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. ఈ చిత్రం విడుదల సమయానికి మాధురీ దీక్షిత్ వయస్సు కేవలం 20 సంవత్సరాలు. ఆపై ఆమె ఇండస్ట్రీలోకి కొత్తగా అడుగులేస్తుంది. ఈ క్రమంలో తనేంటో నిరూపించుకోవడానికి ఆమె గట్టిగానే ప్రయత్నాలు చేసింది. కానీ, వినోద్ ఖన్నా అప్పటికే బాలీవుడ్లో పాపులర్ హీరోగా ఉన్నారు. వీరి కాంబినేషన్లో అలాంటి సీన్ రావడంతో అందరూ షాక్ అయ్యారు.'దయావన్' సినిమా గురించి ఆ రోజుల్లో చాలా కథనాలు వెలువడ్డాయి. అప్పట్లో వచ్చిన నివేదికల ప్రకారం.. రొమాంటిక్ సీన్ తీస్తున్న సమయంలో వినోద్ ఖన్నా పరిది దాటిపోయాడట. స్క్రీప్ట్ ప్రకారం కాకుండా తనకు నచ్చినట్లు చేయడం ఏంటి అంటూ దర్శకుడు కూడా పలుమార్లు కట్ అని చెప్పాడట. అయినప్పటికీ మాధురితో రొమాంటిక్ సీన్ ఆపలేదట. ఆ సమయంలో ముద్దు పెడుతున్న క్రమంలో ఆమె పెదవిని కూడా ఖన్నా కొరికేశాడని దాంతో ఆమె చాలా ఇబ్బందులకు గురైందని చెప్పుకొచ్చారు. ఈ సీన్ తర్వాత మాధురి చాలా ఇబ్బంది పడిందట. విషయం తెలుసుకున్న వినోద్ ఖన్నా క్షమాపణలు కూడా చెప్పారట.సినిమా విడుదల తర్వాత అసలు రచ్చ మొదలైంది. ఆ సీన్‌ను తొలగించాలంటూ కోర్టు నుంచి నోటీసులు కూడా ఇచ్చారు. ఆ సీన్‌ను తెరపై చూసిన తర్వాత మాధురికి కూడా నచ్చలేదట. దీంతో దానిని తొలగించాలని ఆమె కూడా కోరారట. కానీ, దర్శకుడు ఫిరోజ్ ఖాన్ మాత్రం అందుకు ఒప్పుకోలేదు. అందుకు గాను డైరెక్టర్, హీరో కలిసి రూ.1 కోటి అదనంగా చెల్లించారు. ఆ సీన్ తర్వాత వచ్చే సాంగ్‌కు ఇప్పటికీ చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. డింపుల్ కపాడియాతో కూడా మరో సినిమాలో వినోద్ ఖన్నా ఇలాంటి పనే చేశాడని చాలామంది చెబుతుంటారు.ఓషో ఆశ్రమంలో నిరాడంబర జీవితంపేరు, డబ్బు, ప్రేమించి, పెళ్లి చేసుకున్న గీతాంజలి, ఇద్దరు కుమారులు (రాహుల్ ఖన్నా, అక్షయ్ ఖన్నా).. వినోద్ ఖన్నా జీవితం బ్రహ్మాండంగా ఉంది. అయితే జీవితం అంటే ఇదేనా? అనిపించిందాయనకు. అప్పటికే ఆధ్యాత్మిక గురువు ‘ఓషో’ బోధనలకు ఆకర్షితుడయ్యారాయన. చివరికి 1982లో సినిమాలకు ‘రిటైర్మెంట్’ ప్రకటించి, అమెరికాలోని రజనీష్ పురంలో గల ఓషో ఆశ్రమానికి వెళ్లిపోయారాయన. అక్కడ నిరాడంబర జీవితం గడిపారు. టాయ్‌లెట్స్ శుభ్రం చేసేవారు. గిన్నెలు కడిగేవారు. తోటమాలిగా చేసేవారు. అయితే వినోద్ ఖన్నా ఇంటికి దూరం కావడం ఆయన భార్యా, పిల్లలకు ఇబ్బందిగా మారింది. అదే ఆయన్ను వాళ్లకు దూరం చేసింది. వినోద్, గీతాంజలి విడాకులు తీసుకున్నారు. ఓషో ఆశ్రమంలో నాలుగేళ్లు ఉండి, ఇండియాకి వచ్చేసరికి వినోద్ ఖన్నా ఒంటరిగా మిగిలిపోయారు. మళ్లీ ‘ఇన్సాఫ్’ (1987)తో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి, వరుసగా సినిమాలు చేశారు. మొదటి భార్య నుంచి విడిపోయిన ఐదేళ్లకు కవితను పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక కొడుకు (సాక్షి), కూతురు (శ్రద్ధ) ఉన్నారు. మూత్రాశయ క్యాన్సర్‌తో బాధపడుతూ 2017 ఏప్రిల్ 27న ఆయన మరణించారు. -
Holi 2025 : భూమికి పచ్చాని రంగేసినట్టు, రంగులద్దిన ఫ్యాషన్ క్వీన్స్
హోలీ (Holi2025) పండుగ అంటే ఉల్లాసం, ఉత్సాహం. పిల్లాపెద్దా అంతా అందంగా ముస్తాబవుతారు. ఇంద్రధనుస్సు లాంటి రంగులతో ఆటలాడుకుని తమ జీవితాలు మరింత రంగులమయం శోభిల్లాలని కోరుకుంటారు. రంగు రంగుల రంగులు, గులాల్ చల్లుకొని హోలీ ఆడతారు. ఇక సెలబ్రిటీలయితే అందంగా ముస్తాబై తమ అభిమానులను అలరిస్తారు. రంగుల పండుగను సెలబ్రేట్ చేసుకోవడానికి వయసుతో పని ఏముంది అని నిరూపించారు బాలీవుడ్ హీరోయిన్లు. వారెవరో చూసేద్దామా.2025 హోలీ కోసం సాంప్రదాయ చీరలో మాధురి దీక్షిత్ ( Madhuri Dixit ) ప్రశాంతకు చిహ్నమైన పచ్చని రంగులో అందంగాముస్తాబైనారు. తొమ్మిది గజాల అద్భుతంలో ఆకుపచ్చ రంగులో మాధురి యంగ్ అండ్ ఎనర్జటిక్‌గా కనిపించారు. 57 ఏళ్ల ఈ బాలీవుడ్ స్టార్ పండుగ కళతో ఉట్టిపడుతూ దేవతలామెరిపించింది.చీర అంటే గుర్తొచ్చే సెలబ్రిటీలలో మాధురి ఒకరు అనడంలో ఎలాంటి సందేహంలేదు. డిజైనర్ జయంతి రెడ్డి రూపొందించిన చీరకు వెండి జర్డోజీ ఎంబ్రాయిడరీ స్వీట్హార్ట్ నెక్లైన్, జుట్టుగా చక్కగా ముడి వేసుకకొని తన సిగ్నేచర్ లుక్కు మరింత వైభవాన్ని జోడించారు. చదవండి: Holi 2025 Celebrations: యంగ్ హీరోయిన్ల ఫ్యావరేట్ కలర్స్ ఇవే! సెలబ్రిటీ స్టైలిస్ట్, సుకృతి గ్రోవర్ మాధురి ఎథెరియల్ లుక్‌ను వజ్రాలు, పచ్చలు నిండిన మహారాణి నెక్లెస్, చెవిపోగులు, ఇతర ఆభరణలతో ఎథ్నిక్ లుక్కు మెరుపు వచ్చేసింది. గ్లామర్ విత్ ట్రెడిషన్ మాధురి షేర్ చేసిన ఫోటోలను ఇన్‌స్టాలో ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తున్నాయి.చదవండి: Holi 2025 - నేచురల్ కలర్స్ ఈజీగా తయారు చేసుకోండిలా! తగ్గేదెలే అంటున్న రవీనా నాకేం తక్కువ అంటూ ఈ హోలీకి వచ్చేశారు మరో సీనియర్ నటి, 52 ఏళ్ల రవీనా టాండన్ (Raveena Tandon). 90ల కాలంలో ఒక వెలుగు వెలిగిన ఈ అందమైన దివా , ఈ హోలీకి బ్యూటీ ట్రీట్‌ను అందించింది. తన అందమైన కళ్ళతో హోలీకి రంగుల కళను తీసుకొచ్చింది. ఇద్దరు బిడ్డలతల్లి, రవీనా దేశీ స్టైల్ గ్లామ్‌లో మహారాణిలా కనిపించింది. గోధుమరంగు డ్రెస్‌కు, పింక్ కలర్ దుప్పట్టాను జోడించింది. సొగసైన ఝుంకాలు ఆమె లుక్నుమరింత ఎలివేట్ చేశాయి. హోళికా దహన్ శుభాకాంక్షలు అందించారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. -
ఒకప్పటి హీరోయిన్ గ్లామర్ ట్రీట్.. భర్త కౌగిలిలో సాయేషా!
పట్టుచీరలో జిగేలుమని మెరిసిపోతున్న అనసూయలేటు వయసులోనూ అందంలో మాధురీ తర్వాత ఎవరైనాపెళ్లిరోజు.. భార్యని ముద్దాడేస్తున్న తమిళ హీరో ఆర్యహాట్ నెస్ తో చంపేస్తున్న ఆర్ఎక్స్ 100 బ్యూటీ పాయల్రాక్ స్టార్ లా స్టేజీపై పాటలు పాడేసిన తమిళ నటి ఆండ్రియాఉదయం ఎండలో కలర్ ఫుల్ గా కనిపిస్తున్న తృప్తి దిమ్రిఇద్దరు పిల్లలకు తల్లయినా గ్లామరస్ గా ప్రణీత View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Ananya 🌙 (@ananyapanday) View this post on Instagram A post shared by Kriti Sanon 🦋 (@kritisanon) View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) View this post on Instagram A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) View this post on Instagram A post shared by Arya (@aryaoffl) View this post on Instagram A post shared by Mannara Chopra (@memannara) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Triptii Dimri (@tripti_dimri) View this post on Instagram A post shared by Fatima Sana Shaikh (@fatimasanashaikh) View this post on Instagram A post shared by Andrea Jeremiah (@therealandreajeremiah) View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) View this post on Instagram A post shared by Manisha Koirala (@m_koirala) View this post on Instagram A post shared by Sangeerthana (@sangeerthana__vipin) View this post on Instagram A post shared by Nehha Pendse (@nehhapendse) View this post on Instagram A post shared by Madhuri Dixit (@madhuridixitnene) -
వారెవా డ్యాన్స్ : అదరగొట్టిన మాధురి, విద్యా, వైరల్
వయసు పెరుగుతున్న కొద్దీ అందం, నటనతో అభిమానులను ఆశ్చర్యానికి లోనయ్యేలా చేస్తున్నారు కొందరి తారామణులు. వారిలో ఇప్పుడు ముందు వరసలో చేరారు మాధురీ దీక్షిత్. విద్యాబాలన్‌తో కలిసి ఇటీవల ‘అమి జె తోమార్ 3.0’ యుగళగీతానికి నృత్యం చేస్తున్న షూటింగ్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. భూల్ భులయ్యా3 సినిమాలోని ఈ పాట అక్టోబర్ 25న విడుదల అయ్యింది. ఈ సినిమా ట్రైలర్లో ఇప్పటికే మాధురీ దీక్షిత్‌ను చూసిన నెటిజనులు చెక్కుచెదరని ఆమె అందాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇంక ‘అమి జె తోమర్ 3.0’ లో 45 ఏళ్ల విద్యాబాలన్‌తో కలిసి 57 ఏళ్ల మాధురి దీక్షిత్ చేసిన నృత్యం విశేషంగా ఆకట్టుకుంటోంది. 2007లో విడుదలైన భూల్ భులయ్యా సినిమాలోని ఒరిజనల్ ట్రాక్‌కి రీమేక్ ఇది. మ్యూజిక్ డైరెక్టర్ ప్రీతమ్ కం΄ోజ్ చేసిన ఈ పాటను శ్రేయా ఘోషల్ పాడారు. View this post on Instagram A post shared by Vidya Balan (@balanvidya) -
మొన్న బిగ్‌బీ.. నేడు మాధురీ దీక్షిత్: అవే షేర్స్ కొంటున్న సెలబ్రిటీలు
ప్రముఖ నటి 'మాధురీ దీక్షిత్' (Madhuri Dixit) ఇటీవల ఫుడ్ అండ్ గ్రోసరీ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీలో రూ. 1.5 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. ఈ షేర్లను ఇన్నోవ్8 వ్యవస్థాపకులు 'రితేష్ మాలిక్' నుంచి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.మాధురీ దీక్షిత్, రితేష్ మాలిక్ ఇద్దరూ రూ. 3 కోట్ల విలువైన షేర్స్ కొనుగోలు చేసి స్విగ్గిలో వాటాదారులయ్యారు. వీరిరువురు ఒక్కో షేరుకు రూ. 345 చొప్పున చెల్లించినట్లు సమాచారం. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. కాగా ఇప్పటికే స్విగ్గిలో అమితాబ్ బచ్చన్ కూడా ఇన్వెస్ట్ చేసారు.ఇదీ చదవండి: వాటా కొనుగోలు చేసిన బిగ్‌బీ కుటుంబంబెంగళూరు ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న స్విగ్గీ.. త్వరలోనే ఐపీఓకు రానుంది. ఈ ఐపీఓ ద్వారా సుమారు ఒక బిలియన్ డాలర్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. అయితే ఈ ఐపీఓకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో స్విగ్గీ ఆదాయం 36 శాతం పెరిగి రూ. 11,247 కోట్లకు చేరుకుంది. -
అందరి మీదకు అరిచే డైరెక్టర్.. అప్పట్లో ఆ హీరోయిన్ దగ్గర మాత్రం!
లెజెండరీ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీకి కోపమెక్కువ. తనకు గానీ తిక్క రేగిందంటే అవతల ఎవరున్నా సరే ఆగ్రహంతో విరుచుకుపడతాడట! అలాంటిది గతంలో మాత్రం హీరోయిన్‌తో మాట్లాడటానికి కూడా తటపటాయించేవాడట. ఈ విషయాన్ని దర్శకుడు విధు వినోద్ చోప్రా వెల్లడించాడు. 1942: ఎ లవ్ స్టోరీ సినిమా టైంలో విధు వినోద్‌కు సంజయ్ సహాయకుడిగా పని చేశాడు. ఆయన అసిస్టెంట్గాఆ సమయంలోనే అతడి టాలెంట్ గుర్తించి వెన్నుతట్టి ప్రోత్సహించాడు. ఓ ఇంటర్వ్యూలో విధు వినోద్ చోప్రా మాట్లాడుతూ.. సంజయ్ భన్సాలీ.. ఇప్పుడు సంజయ్ లీలా భన్సాలీ అయ్యాడు. అతడు నాకు అసిస్టెంట్‌గా పని చేశాడు. 1942 సినిమాకు అవార్డు వచ్చినప్పుడు వెళ్లి తీసుకోమని తననే పంపించాను. ఇప్పుడేమో ఇలా..ఒకప్పుడు ఎంతో సౌమ్యంగా ఉండేవాడు.. మాధురీ దీక్షిత్‌తో మాట్లాడాలన్నా కూడా భయపడేవాడు. ఇప్పుడేమో అందరి మీదకు గట్టిగా అరుస్తున్నాడు అని చెప్పుకొచ్చాడు. కాగా సంజయ్ లీలా భన్సాలీ ఇటీవలే హీరామండి వెబ్ సిరీస్‌తో ఓటీటీలోనూ అడుగుపెట్టాడు. ప్రస్తుతం దీనికి సీక్వెల్ తెరకెక్కించే పనిలో ఉన్నాడు.చదవండి: నాగార్జున N కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత -
మిల మిల మెరిసే దుస్తులలో మాధూరి దీక్షిత్.. ఫొటోలు
-
నో లేడీ జోడి!
ఏడేళ్లు అయ్యింది. అజయ్ దేవ్గన్ హీరోయిన్ లేకుండా సినిమా చేసి. ఏడేళ్ల క్రితం హీరోయిన్ లేకుండా అజయ్ చేసిన సినిమా ఏంటబ్బా? అని ఆలోచిస్తున్నారా? 2010లో వచ్చిన ‘రాజ్‌నీతి’లో ఆయనకు లేడీ జోడీ లేదు. ‘ధమాల్, డబుల్ ధమాల్’లకు సీక్వెల్‌గా రూపొందనున్న తాజా చిత్రం ‘టోటల్ థమాల్’లోనూ ఆయనకు జోడీ లేదు. మొదటి రెండు భాగాలను తెరకెక్కించిన ఇంద్రకుమార్ మూడో భాగాన్ని కూడా రూపొందించనున్నారు. ఆల్రెడీ థర్డ్ పార్ట్‌లో అనిల్ కపూర్, మాధురీ దీక్షిత్‌లు కీలక పాత్రల్లో నటించనున్నారు. తాజాగా అజయ్ దేవ్‌గన్‌ను తీసుకున్నారు. మొదట ఇలియానాను అజయ్ సరసన హీరోయిన్గా అనుకున్నారట. కానీ, స్క్రిప్ట్ పరంగా అజయ్ క్యారెక్టర్‌కు లేడీ జోడి అవసరం లేదని ఫిక్స్ అయ్యారట ఇంద్రకుమార్. వచ్చే నెలలో ఈ సినిమా షూటింగ్‌ను స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. మేజర్ సీన్స్‌ని లక్నోలో షూట్ చేయనున్నారు. ‘టోటల్ ధమాల్’ చిత్రాన్ని వచ్చే ఏడాది దీపావళికి విడుదల చేయాలనుకుంటున్నారు. -
మే 15న పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రముఖులు: మధురి దీక్షిత్ (బాలీవుడ్ నటి), రామ్ (నటుడు) ఈ రోజు పుట్టిన రోజు జరుపుకునేవారికి ఈ సంవత్సరం కొత్త స్నేహాలు, కొత్త బంధాలు ఏర్పడతాయి. వీరి సంవత్సర సంఖ్య 1 అయినందువల్ల నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి, అవివాహితులకు వివాహ యోగం, మీడియా రంగంలో పని చేసేవారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. అవాంఛనీయమైన పాత స్నేహాలు, పాత బంధాలు, దురలవాట్ల నుంచి బయట పడతారు. పిల్లల వివాహం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. కోరుకున్న ప్రదేశాలకు బదిలీ అవుతుంది. విద్యార్థులు కోరుకున్న కోర్సులలో సీటు వస్తుంది. వీరు కొంచెం నోటిదురుసు, అహంభావాన్ని తగ్గించుకుని, నిదానంగా వ్యవహరించటం మంచిది. లక్కీ నంబర్లు: 1,5,6,9, లక్కీ కలర్స్: వైట్, క్రీమ్, రోజ్, ఆరెంజ్. లక్కీడేస్: ఆది, మంగళ, శుక్రవారాలు. శుక్రజపం చేయించుకోవడం, ఆదిత్యహృదయ పారాయణం చేయడం, ఈశ్వరుణ్ణి ఎర్రని పూలతో పూజించడం మంచిది. ఆడపిల్లలకు చదువుకయ్యే ఖర్చును భరించడం, అనాథ వృద్ధులకు అన్నదానం చేయడం వల్ల కలిసి వస్తుంది. - రహిమాన్ దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్