మే 15న పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రముఖులు | On May 15, the birthday celebrated | Sakshi
Sakshi News home page

మే 15న పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రముఖులు

May 14 2015 11:59 PM | Updated on Sep 3 2017 2:02 AM

మే 15న  పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రముఖులు

మే 15న పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రముఖులు

ఈ రోజు పుట్టిన రోజు జరుపుకునేవారికి ఈ సంవత్సరం కొత్త స్నేహాలు, కొత్త బంధాలు ఏర్పడతాయి. వీరి సంవత్సర సంఖ్య 1

ఈరోజు మీతో పాటు పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రముఖులు:
మధురి దీక్షిత్ (బాలీవుడ్ నటి), రామ్ (నటుడు)

 
ఈ రోజు పుట్టిన రోజు జరుపుకునేవారికి ఈ సంవత్సరం కొత్త స్నేహాలు, కొత్త బంధాలు ఏర్పడతాయి. వీరి సంవత్సర సంఖ్య 1 అయినందువల్ల నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి, అవివాహితులకు వివాహ యోగం, మీడియా రంగంలో పని చేసేవారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. అవాంఛనీయమైన పాత స్నేహాలు, పాత బంధాలు, దురలవాట్ల నుంచి బయట పడతారు.

పిల్లల వివాహం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. కోరుకున్న ప్రదేశాలకు బదిలీ అవుతుంది. విద్యార్థులు కోరుకున్న కోర్సులలో సీటు వస్తుంది. వీరు కొంచెం నోటిదురుసు, అహంభావాన్ని తగ్గించుకుని, నిదానంగా వ్యవహరించటం మంచిది. లక్కీ నంబర్లు: 1,5,6,9, లక్కీ కలర్స్: వైట్, క్రీమ్, రోజ్, ఆరెంజ్. లక్కీడేస్: ఆది, మంగళ, శుక్రవారాలు. శుక్రజపం చేయించుకోవడం, ఆదిత్యహృదయ పారాయణం చేయడం, ఈశ్వరుణ్ణి ఎర్రని పూలతో పూజించడం మంచిది. ఆడపిల్లలకు చదువుకయ్యే ఖర్చును భరించడం, అనాథ వృద్ధులకు అన్నదానం చేయడం వల్ల కలిసి వస్తుంది.                                                      

    - రహిమాన్ దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్
 

Advertisement
 
Advertisement
Advertisement